Iife Policy : జీవిత పాలసీ తీసుకోబోయే ముందు గమనించాల్సిన విషయాలివే..!!

Iife Policy : భారత పౌరుడిగా ప్రతి ఒక్కరూ జీవిత పాలసీ తీసుకోవడం అనేది తప్పనిసరి.. ఆర్థిక ప్రణాళికలలో జీవిత బీమా కే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా జీవిత బీమా చేయించుకోవాలని ప్రజలకు సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ డిజిటల్ యుగంలో జీవిత బీమా పాలసీలను పరీక్షించి తీసుకోవడం సులభతరం గానే ఉంటున్నప్పటికీ పాలసీని ఎంపిక చేసుకునే ముందు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి నష్టం ఉండదు. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఈ ఆర్టికల్ ను వారికి షేర్ చేసి సమాచారాన్ని అందించగలరు. ఇక ఆ అంశాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

పాలసీ ని సొంతంగా అధ్యయనం చేయడం : మీలో ఎవరైనా సరే పాలసీ తీసుకునేటప్పుడు సొంతంగా దగ్గరుండి పాలసీల గురించి తెలుసుకోవాలి. ఏ పాలసీ తీసుకుంటున్నాము.. దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి.. ఎంత పెట్టుబడిగా పెట్టాలి.. ఎంత లాభం అనే విషయాలను మనం ముందుగా గమనించాలి. అంతే కాదు ఇప్పుడు మనం తీసుకునే పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉంటేనే ఆ పాలసీలు తీసుకోవడం ఉత్తమం.

Consideration before taking out a life policy
Consideration before taking out a life policy

ఆర్థిక లక్ష్యాలను చేదించే పాలసీ : ప్రతి ఒక్కరి జీవితంలో .. ఆకాంక్షలు, లక్ష్యాలు అనేవి వేరువేరుగా ఉంటాయి.. కాబట్టి మీ లక్ష్యాలను అర్థం చేసుకొని.. పెళ్లిళ్లు, మీ పిల్లల చదువులు, రుణాలు, వైద్య ఖర్చులు లేదా రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత కూడా ఆదాయం పొందే పాలసీ తీసుకోవడం తప్పనిసరి.

పాలసీ నీ కొలాప్స్ చేయకండి.. పాలసీ టర్మ్ పూర్తయ్యేవరకు సంవత్సర ప్రీమియం చెల్లించడం ఆపకుండా జాగ్రత్తపడాలి. ఇక మీరు ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించడం వల్ల మీకు నిర్ణీత సమయంలో అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలో మీ చేతికి డబ్బు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీ తీసుకుంటే మీకు, మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఇకపై పాలసీ తీసుకుంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి.