Smartphone : స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు శుభవార్త.. త్వరలోనే అతి తక్కువ ధరకే 5 G మొబైల్..!!

Smartphone : రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో కలిగిన స్మార్ట్ఫోన్లను ఉపయోగించాలని వినియోగదారులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటికే ప్రపంచంలోనే దిగ్గజ మొబైల్ తయారీ సంస్థలు అయినటువంటి ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్లతో తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ మోటరోలా కంపెనీ కూడా సరికొత్త స్మార్ట్ఫోన్ లను భారత మార్కెట్లోకి త్వరలోనే విడుదల చేస్తామని అధికారికంగా స్పష్టం చేసింది. ఇక మోటోరోలా ప్రవేశపెడుతున్న స్మార్ట్ఫోన్ మోటో జి 82 5 G స్మార్ట్ ఫోన్ అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తామని డేట్ ని కూడా ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి ఈ స్మార్ట్ మొబైల్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

ఈ క్రమంలోనే మోటోరోలా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో త్వరలోనే పలాంఛ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి మోటోరోలా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ ఫోన్లో ఉన్న కొన్ని కీలక ఫీచర్లను కూడా రిలీజ్ చేసి అభిమానులను మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే ఈ మోటో 5g ఫోన్ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన ఆదరణ పొందుతోంది. అందుకే భారత మార్కెట్లో లాంచ్ కాబోయే మోటో ఫోన్ లో కొన్ని కీలక ఫీచర్లు ముఖ్యమైనవి మనం ఇప్పుడు ఒకసారి పూర్తిగా చదువు తెలుసుకుందాం.

The good news for smartphone lovers is the low cost 5G mobile
The good news for smartphone lovers is the low cost 5G mobile

మోటో జి 82 5G ఫీచర్స్ : 120 Hz  తో 10 బిట్ పోలెడ్ డిస్ప్లే తోపాటు ట్రిపుల్ సెటప్ రియర్ కెమెరాను కూడా అందించారు. ఈ కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ఓ ఐ ఎస్ ప్రైమరీ సెన్సార్ తో మనకు లభించనుంది ఇక యూరప్లో moto g2 5g ప్రారంభ ధర 329.99 యూరోలు కాగా భారత కరెన్సీ ప్రకారం ఈ మోటో జి 82 5 జి ధర సుమారుగా 26,500 రూపాయల వరకు ఉంటుంది. కానీ  భారత మార్కెట్లో విడుదల చేయబోయే ఈ వేరియంట్ మోటో ఫోన్ ద్వారా కొంచెం తక్కువగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఇక ఈ మోటో జి 82 ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ లో ఉండే స్టోరేజ్ విషయానికి వస్తే 6GB ర్యామ్ అలాగే 128 GB స్టోరేజ్ మోడల్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో స్పెషల్ పేజీలో లిస్ట్ అవడం గమనార్హం. ఇకపోతే మోటో జి 82 ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది

ఇక కలర్స్ విషయానికి వస్తే మెట్రో రైట్ గ్రేట్, వైట్ లిల్లీ 12 కలర్ ఆప్షన్లలో మనకు లభించనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ 5 ఫోను గ్లోబల్ మోడల్ ను పోలి ఉంటుంది యూరోపియన్ మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే..120 Hz రీ ఫ్రెష్ రేటుతో సిక్స్ పాయింట్ సిక్స్ అంగుళాల పోఎల్ఈడి డిస్ప్లే తో లభిస్తుంది. ఇక 360 Hz టచ్ స్లీపింగ్ తో ఈ మొబైల్ లో ఉండడం గమనార్హం. 30  W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టుతో 5000 mah బ్యాటరీని అందించారు. ఇక ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ మైక్రో సెన్సార్ తో మొబైల్లో కెమెరాలు అమర్చబడ్డాయి. ఇక సెల్ఫీ వీడియో కోసం 16 ఎంపీ సెన్సార్ కూడా అమర్చడం గమనార్హం. మొత్తానికి అయితే ఈ ఫోన్ పై మోటోరోలా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి భారత మార్కెట్లో మొత్తానికి అయితే జూన్ 7వ తేదీన లాంచ్ కానున్నట్లు సమాచారం.