Solar Car : మొట్టమొదటి సోలార్ కార్.. ఫీచర్ చూస్తే వావ్ అనాల్సిందే..!!

Solar Car : టెక్నాలజీ పెరిగిపోతోంది..ఆధునికతను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.. ఈ నేపథ్యంలోనే ఏదైనా సరే సరి కొత్తగా ఉండాలి అని చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండటం గమనార్హం. అంతే కాదు కొత్తగా కనిపెట్టాలి అనే ఆలోచన వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానిని సాధించే వరకు నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే విజయాన్ని సొంతం చేసుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో వాహనాల విషయంలో ఈ టెక్నాలజీ అనేది మరింత పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా డబ్బు సంపాదించి అందరికంటే ఉన్నతంగా జీవించాలి అని అత్యద్భుతమైన కార్లలో తిరగాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ కార్ అనేది ఉంటుంది. ఇక ఆ డ్రీం కార్ ను వారు సొంతం చేసుకోవడానికి ఎంత కష్టపడి అయినా సరే చివరికి సొంతం చేసుకుంటూ ఉన్నారు.

Advertisement
The first solar car features on Released into the market
The first solar car features on Released into the market

ఈ నేపథ్యంలోనే చాలామంది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ కార్లను కూడా కొనుగోలు చేసుకోవాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో భారత మార్కెట్లోకి ఇటీవల విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలు బాగా పాపులారిటీ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల కాలంలో విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఇక రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా చాలామంది విద్యుత్ ఆధారిత వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రభుత్వాలు సైతం పర్యావరణ పరిరక్షణ విషయమై ఇందన వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఇవ్వడం కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో అడుగుపెట్టి అత్యాధునికమైన ఫీచర్లతో వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు పనిచేస్తున్నాయి.

Advertisement
The first solar car features on Released into the market
The first solar car features on Released into the market

ఇకపోతే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీలను చార్జింగ్ చేసుకుంటేనే నడిచే పరిస్థితి ఉండేది. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా ఏకంగా సోలార్ ఆధారంగా నడిచే వాహనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా ఉపయోగించే కొద్దీ విద్యుత్ వనరు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి సోలార్ ద్వారా విద్యుత్ ను పొందగలిగే టెక్నాలజీని తయారు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగవు కదా అని ఆలోచించిన ఎంతో మంది నిపుణులు ఇలా సోలార్ తో నడిచే వాహనాలను తయారు చేస్తున్నారు. ఇకపోతే ఇకపై భయపడాల్సిన అవసరం లేకుండా లైట్ ఇయర్ 0 పేరిట సోలార్ తో నడిచే ఒక ఎలక్ట్రిక్ కారు ను రూపొందించడం జరిగింది. ఈ కారు యొక్క ధర, ఫీచర్లు కూడా ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. నెదర్లాండ్ దేశానికి చెందిన లైట్ ఇయర్ అనే ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తాజాగా లైట్ ఇయర్ 0 కారును లాంచ్ చేసింది.

The first solar car features on Released into the market
The first solar car features on Released into the market

అంతేకాదు ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ పవర్ తో నడిచే తొలి కారుగా ఇది పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా సూర్యుడు నుండి వెలువడే కాంతి ని ఉపయోగించి ఈ కారు లో ఉండే బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. ఇక ఇందుకు అనుగుణంగా కారు పైన సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేశారు. ఇక దీంతో కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే కూడా ఛార్జ్ అవుతుంది. ఇక సోలార్ పవర్ ను ఉపయోగించి ఒక్కసారి ఫుల్ చార్జ్ చేశారు అంటే చాలు ఏకంగా 624 కిలోమీటర్ల దూరం వరకు నిక్షేపంగా వెళ్లవచ్చు. ఇకపోతే వర్షాకాలం, శీతాకాలం సమయంలో ఎలా అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ కాలంలో కూడా మీరు ఆందోళన చెందకుండా చార్జింగ్ కూడా బ్యాటరీ చార్జింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.

ఇకపోతే హైవే మీద మీరు ప్రయాణిస్తున్న సమయంలో ప్రతి వంద కిలోమీటర్లకు కేవలం 10.5 kWh మాత్రమే వినియోగించుకోవడం వారి యొక్క ప్రత్యేకత. ఇక ఈ కార్యకర్త ఇంటీరియర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక నావిగేషన్ ఎంటర్టైన్మెంట్ కోసం 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ను కూడా అందించారు. ఈ కారు ప్రారంభ ధర ప్రస్తుతం రూ.2.05 కోట్లు. ఇక ఈ కార్యకర్త ఆర్డర్లను ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతాయని తెలిపిన కంపెనీ.. ఇక భారత్ లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి అన్న విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement