Smart Phones : మార్కెట్లో లభించే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

Smart Phones : టెక్నాలజీ మారిపోతున్న కొద్ది స్మార్ట్ మొబైల్స్ కూడా రోజుకొక కొత్త మోడల్ తో సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు తమ అభిరుచులకు తగ్గట్టుగా స్మార్ట్ మొబైల్ కొనాలని ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో చిన్న పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్ యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఎన్నో రకాల కంపెనీలు రకరకాల ఫీచర్లతో అత్యాధునిక టెక్నాలజీతో భారత మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. మొన్నటివరకు 3G అన్నారు నిన్నటి వరకు 4G.. ఇప్పుడు 5G వచ్చేసింది.

ఇప్పుడు ఏకంగా 5 జి నెట్వర్క్ సూపర్ ఫాస్ట్ స్మార్ట్ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారు. ఇక ఒకరిని చూసి మరొకరు వినియోగదారులు కూడా పోటీ పడుతూ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో భారత మార్కెట్లో విడుదలైన అత్యద్భుతమైన సూపర్ ఫాస్ట్ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ ల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇండియా లో విడుదలైన 5 G సామర్థ్యంతో అన్ని ఫోన్లు కూడా రూ. 20 వేల లోపు లభించడం గమనార్హం . మరి ఆ 5 G స్మార్ట్ ఫోన్ ల గురించి ఇప్పుడు చూద్దాం.

1. Vivo T1 : ఫోన్ డివైస్ 6.5 8 అంగుళాలు ఉంటుంది. (2408X1080 పిక్సెల్) ఇక పూర్తి హెచ్డి ప్లస్ 120 హెడ్జెస్ ఎల్సిడి స్క్రీన్తో ఈ మొబైల్ రానుంది. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 6958nm చెప్పు తో పనిచేస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే..128GB UFS 2.2 స్టోరేజ్ తో 4GB/6GB/8GB LPDDR 4x RAM తో ఈ మొబైల్ లభిస్తుంది ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఫన్ టచ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ 2.0 ఆండ్రాయిడ్ 11 .. కెమెరా విషయానికి వస్తే స్త్రీ రియర్ కెమెరా సెటప్ అందులో 50MP +2MP +2MP రియర్ కెమెరా సెటప్ లభిస్తుంది. సెల్ఫీ కోసం ఫ్రంట్ కెమెరా అమర్చబడింది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mah బ్యాటరీ దీని సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 15, 990.

The best 5G Smart Phones available in the market
The best 5G Smart Phones available in the market

Poco x4 pro : ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.18,999.. ఇక పొడుగు విషయానికి వస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి + AMOLED డిస్ప్లే తో లభిస్తుంది ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 695 8 nm మొబైల్ ఫ్లాట్ ఫారం 6GB LPDDR4X RAM , 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, మరొక వేరియేషన్ 256GB USF 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 8GB LPDDR4X RAM స్టోరీస్ ఇస్మార్ట్ మొబైల్ మే ముందుకు వస్తోంది కెమెరా విషయానికి వస్తే.. 108MP +8MP+2MP రియర్ కెమెరా తో 16mp ఫ్రంట్ కెమెరా లభిస్తుంది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో లభించడం గమనార్హం.

One plus Nord ce 2 lite 5G : ఇక ఈ ఫోన్ ధర మార్కెట్ లో రూ.19,999 ఉండగా ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసే వారికి 2000 డిస్కౌంట్ తో కూడా ఈ మొబైల్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం నెల రోజులు మాత్రమే ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక ఈ కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే..6.59 అంగుళాల పొడవుతో ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి స్క్రీన్తో ఈ మొబైల్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 128 జీబీ స్టోరేజ్ USF 2.2 , 6GB/8GB LPDDR4X RAM, ఆక్సిజన్ ఓ ఎస్ 12.1 తో నడిచే ఆండ్రాయిడ్ ఫోన్. కెమెరా విషయానికి వస్తే..64 MP +2MP +2MP రియల్ కెమెరా సెటప్ ఉండగా సెల్ఫీ కోసం 16 ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఇవ్వడం జరిగింది ఇక బ్యాటరీ 5000 ఎంఏహెచ్ రానుంది.. ఇక ఈ మొబైల్స్ తో పాటు రియల్ మీ 9 pro 5g స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999, IQOO Z65G స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999