Business Idea : ఏ సీజన్లో అయినా ఈ పూలతో లక్షల్లో లాభం..!!

Business Idea : ఈ మధ్య కాలంలో చాలా మంది యువత ఉద్యోగం చేయడం కంటే ఏదైనా వ్యాపారం చేస్తే డబ్బు ఎక్కువగా వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు. ఉద్యోగం చేసే వారికి నియమ నిబంధనలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికైనా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే వారిని వీరిని అడుక్కోవాల్సిన సమయం కూడా ఏర్పడింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన పై అధికారులకు చెప్పకుండా ఏ పని చేయలేని పరిస్థితికి కూడా చేరుకున్నారు. ఇక ఉద్యోగం చేసే వారికి స్వేచ్ఛ ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ఇటువంటి నియమ నిబంధనలను తట్టుకోలేక చాలా మంది ఉద్యోగం చేయడం కన్నా ఏదైనా వ్యాపారం చేయడం మేలు అని ఆలోచిస్తున్నారు. ఇక వ్యాపారం చేయడం అనేది కేవలం స్వేచ్ఛ కోసం మాత్రమే కాదు మంచిగా డబ్బు పొందవచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు.

Advertisement

ఇకపోతే ఎవరైనా సరే ఉద్యోగం చేసేవారు నెలంతా కష్టపడితే తప్ప నెల చివరి వరకూ జీతం రాదు. ఒకవేళ అలా వచ్చిన డబ్బు ఉంటుందా అంటే పడి పడక ముందే EMI, లోన్ అంటూ ఖర్చూ అయిపోతూ ఉంటాయి. ఇక పోతే ఇలాంటి లైఫ్ ను చాలామంది ఇష్టపడడం లేదు. అందుకే చిన్నదో పెద్దదో ఏదో ఒక బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇక బిజినెస్ చేయాలనే ఆలోచన బాగున్నప్పటికీ.. అందుకు తగ్గట్టుగా డబ్బు కూడా కావాలి.. ఇక ఇలా చాలామంది డబ్బులు లేక బిజినెస్ చేయాలనే ఆలోచనలో కూడా వున్నారు. ఇకపోతే చాలామంది కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తున్న చాలా వ్యాపారాలు చేస్తూ మంచి లాభార్జన కూడా పొందుతున్నారు. మీరు కూడా అంత డబ్బు పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం రూ.1000, రూ.5000, రూ.10000 ఇలా చిన్న మొత్తంలోనే పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందుతున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.

Advertisement
Business Idea Profit in lakhs with these flowers in any season
Business Idea Profit in lakhs with these flowers in any season

ఇక మీరు కూడా మంచి లాభాలను పొందాలని ఆలోచిస్తున్నట్లు అయితే ఇప్పుడు చెప్పబోయే పూలతో వ్యాపారం ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇక ఆ పువ్వులే ట్యూబెరెస్ పువ్వులు.. ఈ పువ్వులు చాలా కాలం పాటు తాజాగా ఉండడమే కాకుండా మంచి సువాసనను కూడా అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మార్కెట్లో ఈ పూలకు మంచి డిమాండు ఉండడానికి కూడా కారణం ఇదే కావచ్చు. ఇక వివాహాలకు, అన్ని రకాల ఫంక్షన్లకు కూడా ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ పూలను సుగంధద్రవ్యాల తయారీలో కూడా ఎక్కువగా ఈ పువ్వులను ఉపయోగిస్తున్నారు. ఇక ఈ పువ్వుల సాగులో చాలామంది రైతులు లాభాలు పొందుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ సాగు గురించి పూర్తిగా చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా మన భారత దేశంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తో పాటు కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తున్నారు.

ముఖ్యంగా 20 వేల హెక్టార్లలో దీనిని సాగు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక విదేశాలలో విషయానికి వస్తే ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలలో కూడా ఈ వ్యాపారం ఉండడం గమనార్హం. అయితే ఈ పువ్వు మొదట ఇటలీ లో పుట్టిందట. ట్యూబెరెస్ పూల పెంపకం కోసం మొదటగా పొలంలో ఎకరానికి ఎనిమిది ట్రాలీల ఆవుపేడతో మంచి కంపోస్టును చల్లాలి. ఇక అలాగే DAP ఎరువులను కూడా ఉపయోగించవచ్చు. ఇక ఈ పువ్వులు దుంపల ద్వారా వస్తాయి కాబట్టి.. ఒక ఎకరానికి 20 వేల దుంపల అవసరం ఉంటుంది. మీరు అవసరం అనుకుంటే ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా తీసుకోవచ్చు. ఇక ఈ పూలను మీ సమీపంలోని దేవాలయాలకు, పూల దుకాణాలకు , పెళ్లి గృహాలకు మొదలైన వాటిలో సులభంగా విక్రయించవచ్చు. ఒక్కొక్క పువ్వు ఆరు రూపాయల వరకు అమ్ముడు పోతుంది. అంటే ఎకరం పూలతో మీరు సులభంగా రూ.6 లక్షల రూపాయల వరకు లాభం పొందవచ్చు.

Advertisement