ఈ పొరపాట్ల చేయడం వల్ల మన దగ్గర ఉండే డబ్బు మొత్తం .. లాస్..!!

సాధారణంగా మనిషికి ఆశ ఎక్కువే..అలాగే అత్యాశ కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలోనే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.. అయితే వాస్తుకు సంబంధించి చిన్న తప్పులు జరిగితే వాటి వల్ల ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంటుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడటం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఎదురవుతాయని చెప్పవచ్చు.. ఆ పొరపాట్లు ఏమిటో వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

The amount of money we have due to making these mistakes
The amount of money we have due to making these mistakes

1). ముఖ్యంగా మన ఇంట్లో ఉండే చెత్త ఒక డస్ట్ బిన్ లో వేస్తూ ఉంటాము. అయితే ఆ డస్ట్ బిన్ ను మనం గడప దగ్గర, ఇంటి బయట ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట. దీంతో ధనికుడు ని కూడా పేదవాడి గా మార్చే అవకాశం ఉంటుంది.

2). ఎక్కువ మంది భోజనం చేసేటప్పుడు మంచం మీద కూర్చుని తినడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం చాలా దరిద్రమట. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి ఆనందానికి, శ్రేయస్సుకు కూడా ఆటంకం కలిగిస్తుందట.

3). రాత్రి సమయాలలో మన వంటగదిలో కాని, బాత్రూం లో కానీ ఉండేటువంటి పాత్రలను ఖాళీగా ఉంచడం వల్ల అశుభం కలుగుతుందట. బాత్రూం లో ఉండే బకెట్లో కనీసం కొన్ని నీళ్లయినా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడంవల్ల నెగటివ్ ఎనర్జీ పోయి అంతా మంచి జరుగుతుంది.

4). మరీ ముఖ్యంగా రాత్రి సమయాలలో భోజనం చేసిన తరువాత పాత్రలో కాస్తయినా అన్నం మెతుకులు ఉండేలా చూసుకోవాలి. అలాగే వంట గదిని రాత్రి సమయాలలో కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఆర్థిక నష్టాలు వెలువడే అవకాశం ఉంటుంది.

5). ఎట్టి పరిస్థితులలోను చేయకూడని పని ఏమిటంటే సాయంత్రం వేళల ఉప్పు, పాలకు సంబంధించిన వాటిని ఎప్పటికీ దానం చేయకూడదు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయట.