Jobs : రాజ్యసభలో సెక్రటేరియట్ లో కేంద్ర కొలువులు..!!

Jobs : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ ఉన్నది.. తాజాగా ఈ రోజున రాజ్యసభ సెక్రటేరియట్ లో పలు ఉద్యోగాలుకు సంబంధించి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా పర్సనల్ అసిస్టెంట్, సెక్రటరియేట్ అసిస్టెంట్, ట్రాన్స్ లేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హులైన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Central scales in the Secretariat in the Rajya Sabha
Central scales in the Secretariat in the Rajya Sabha

1). మొత్తం ఖాళీల సంఖ్య..110
1). ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టులు-12
2). అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్/ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టులు-26
3). సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు-27
4). అసిస్టెంట్ రీసెర్చ్/రిఫరెన్స్ ఆఫీసర్ పోస్టులు-3
5). ట్రాన్స్ లేటర్ పోస్టులు-15
6). ఆఫీసర్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు-12
7). పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు-15

2). వయస్సు : ఈ పోస్టులకు 56 సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు.

3). జీతభత్యాలు : ఇందులో జీతభత్యాలు పే స్కేల్ -4 నుంచి స్కేల్ -10 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

4). అర్హతలు : అభ్యర్థులు పోస్ట్ ను బట్టి నోటిఫికేషన్ లో సూచించిన విధంగా అర్హతలు ఉండాలి. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి.

5). ఎంపిక విధానం : ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

6). దరఖాస్తు విధానం :ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

7). అభ్యర్థులు తమకు సంబంధించిన పత్రాలను అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఈ కింద ఇవ్వబడిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా పంపవలెను.Director (Personnel), Room Number – 240, 2nd Floor, Rajya Sabha Secretariat, Parliament of India, Parliament House Annexe, New Delhi-110001

అభ్యర్థులు చివరిగా దరఖాస్తు పంపించాల్సిన చివరి తేదీ మార్చి 19 నుంచి 45 రోజుల లోపు పంపాలి. అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని ఈ అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చుhttps://rajyasabha.nic.in/