Big Boss 6 Telugu : బిగ్ బాస్ ప్రతి సీజన్లో ఎవరో ఒకరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పులిహోర రాజాలు తమకు నచ్చిన వ్యక్తులతో పులిహోర కలుపుతుండగా, జనాలు దానిని కూడా తెగ ఎంజాయ్ చేశారు. అయితే సీజన్6లో పులిహోర రాజాలు ఎక్కువై పోయారు. ఒకవైపు సూర్య, మరోవైపు అర్జున్ కళ్యాణ్ తెగ పులిహోర కలిపేస్తున్నారు. అర్జున్ కళ్యాణ్ అయితే డే 1 నుండి శ్రీసత్యతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. ఛీ కొడుతున్నా, చీదరించుకున్నా కూడా ఆమె లోకంలో మునిగితేలుతున్నాడు. శ్రీసత్యకి ఆల్రెడీ లైఫ్లో పెద్ద దెబ్బ పడడంతో ఆమె ఎవరిని ప్రేమించే ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తుంది. కాని అర్జున్ మాత్రం ఆమెని పడేసేందుకు నానా తిప్పలు పడుతున్నాడు.
Big Boss 6 Telugu : కన్నింగ్ లేడి..
నేను ఏ మాత్రం కరగను అని శ్రీసత్య చెప్పిన కూడా అర్జున్ మాత్రం తగ్గేదే లే అన్నట్టు ఆమె వెంట పడుతున్నాడు. చూసేటోళ్లకు చిరాకు వస్తుంది అని మనోడు మాత్రం ఆమెను పడేసే పనిలోనే ఉన్నాడు. అయితే శ్రీసత్య మాత్రం దొరికిందే ఛాన్స్ అన్నట్టు తెగ ఆటిట్యూట్ చూపించేస్తుంది. నేను మనుషులతో మాట్లాడటం ఎప్పుడైనా చూశావా? నేను ఎవరికోసం అయినా ఏడ్వడం చూశావా? నాకు మనుషులు వద్దని నీకు తెలియదా? నా లైఫ్ నుంచి ఎవరైనా వెళ్లిపోతానంటే హ్యాపీగా వెళ్లిపోవచ్చు అంటూ తెగ గొప్పలు చెప్పుకుంది. ఇక అతనిని ఎడమకాలితో తన్నినట్టు చేయడంతో పాటు ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా ఉపయోగించుకుని.. చివరికి అర్జున్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తుంది ఈ అమ్మడు.
అమ్మో శ్రీసత్య బిగ్ బాస్ హౌజ్లోకి పకడ్బంది ప్లాన్ తోనే వచ్చినట్టు కనిపిస్తుంది. శ్రీ సత్య హౌస్లోకి వెళ్లక ముందు కొన్ని ఇంటర్వ్యూల్లో తన ప్రేమ విషయం గురించి చెప్పింది. కానీ, ఆ ముచ్చట మరోలా ఉంది. తమ ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రియుడి నుండి విడిపోవల్సి వచ్చింద చెప్పింది. ఇక హౌజ్లో ఆమె స్క్రీన్ ప్లే మరోలా ఉంది. అతడు మోసం చేశాడని, ఆ బాధ నుండి బయటపడలేకపోయానని ఏవేవో కహానీలు చెప్పింది. చూస్తుంటే ఈ అమ్మడు చాలా ఖతర్నాక్ అనిపిస్తుంది.