Flipkart Big Billion days sale : రూ.11,099 కే గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్.. పొందడం ఎలా అంటే..?

Flipkart Big Billion days sale : ప్రస్తుతం దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో నిర్వహిస్తున్న ప్రత్యేకమైన సేల్ లో భాగంగా ఎన్నో వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే భారత్లో కూడా గత కొద్ది నెలల క్రితం లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6A మొబైల్ పై కూడా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రావడం గమనార్హం. సాధారణంగా ఈ మొబైల్ రూ.43, 999 ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇక గూగుల్ పిక్సెల్ సిక్స్ ఏ మొబైల్ పై ఫ్లిప్కార్ట్ లో బిగ్ దీపావళి సేల్ లో లో భాగంగా రూ. 10,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.

How to get Rs.11,099 Google Pixel 6A phone
How to get Rs.11,099 Google Pixel 6A phone

ఇంకా ఎవరైనా సరే గూగుల్ పిక్సెల్ 6A మొబైల్ కావాలనుకునే వారికి ఇదే మంచి తరుణం అని చెప్పవచ్చు. ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాలి సేల్ లో భాగంగా గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన స్మార్ట్ ఫోన్ పై గొప్ప తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ.43,999 అయినప్పటికీ దీనిని ప్రస్తుతం తగ్గింపు ధర కింద రూ. 34,199కి జాబితా చేయబడింది. ఇక ఇదే కాకుండా ఈ ఫోన్ పై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కలుపుకుంటే ఈ మొబైల్ ధర ఇంకా తగ్గవచ్చు. ఫ్లిప్కార్ట్ లో కోటక్ బ్యాంకు మరియు ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించడం వల్ల 10 శాతం తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది.

అలాగే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పై రూ.16,900 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్లు స్వీకరించడం వల్ల రూ.6, 200 తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక వీటన్నిటిని కలుపుకుంటే గూగుల్ పిక్సెల్ సిక్స్ ఏ మొబైల్ ను కేవలం రూ.11, 099 కే సొంతం చేసుకోవచ్చు.