Allu Sneha Reddy : సినిమాల్లోకి అల్లూ అర్జున్ భార్య అల్లూ స్నేహా రెడ్డి .. !

Allu Sneha Reddy :   అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌న్నీకి ఎంత ఆద‌ర‌ణ ఉందో, అదే రేంజ్‌లో స్నేహా రెడ్డి కూడా సంపాదించుకుంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది సంగ‌తి మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తెస్తుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ వినోదం పంచుతూ ఉంటుంది.అల్లు అర్జున్ తో, పిల్లలతో ఉన్న ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వచ్చిన స్నేహా.. ఇక ఈ మధ్య తన ఫోటో షూట్స్ తో ర‌చ్చ చేస్తుంది.

sneha-reddy-enter-into-the-movie
sneha-reddy-enter-into-the-movie

Sneha Reddy : ఇది గ్రేట్ న్యూస్..

హీరోయిన్ల ను మించిన అందంతో ఇన్ స్టాలో క్యూట్‌ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ అద‌ర‌గొడుతుంది స్నేహా రెడ్డి. అయితే ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాకే ప‌రిమితం అయిన స్నేహా రెడ్డి ఇప్పుడు సినిమాల‌లోను అద‌ర‌గొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతుంద‌ట‌. స్నేహ రెడ్డికి ఓ మలయాళ సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ టాలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే అందులో ఆమె ఏ పాత్ర పోషించబోతుంది అన్న విషయంలో మాత్రం ఎవ‌రికి క్లారిటీ లేదు. హీరో చెల్లెలి పాత్ర‌లో ఈ అమ్మ‌డు న‌టించ‌నుంద‌ని ఇన్‌సైడ్ టాక్.

ఇక అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తుంటారు . తన సతీమణి స్నేహ రెడ్డి, పిల్లలతో కలిసి వెకేషన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అల్లు అర్జున్ త్వరలో పుష్ప సీక్వెల్ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ఈసారి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.