Singer Mangli: సింగర్ మంగ్లీ ఒక్క పాట కోసం తీసుకునే సొమ్ము తెలిస్తే మీ కళ్ళు బైర్లు గమ్ముతాయి .. హీరోయిన్ లు కూడా పనికిరారు !

Singer Mangli: సింగర్ మంగ్లీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో ఈ పేరు విపరీతంగా మారుమోగిపోతోంది.. స్టార్ సింగర్స్ కి మించిపోయిన రేంజ్ లో ఈమె పాడిన పాటలు ప్రజాదారణ పొందాయి.. మంగ్లీ పాడిన పాటలు వైరల్ అవ్వడంతో ఇక పొలిటిషన్ కూడా ఈమె చేతనే స్పెషల్ సాంగ్స్ వారి పార్టీ తరపున పాడించుకున్నారు..

Advertisement
Singer mangli Remuneration For one song
Singer mangli Remuneration For one songSinger mangli Remuneration For one song

ఈ మధ్యకాలంలో సింగర్ మంగ్లీ పాడిన ప్రతి పాట బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాంతో సింగర్ మంగ్లీ ఒక పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. కాగా సింగర్ మంగ్లీ తన కెరియర్ మొదట్లో పదివేల నుంచి 20వేల రూపాయల వరకు ఒక్క పాటకు రెమ్యూనరేషన్ తీసుకునే వారట. అయితే ప్రస్తుతం ఆమెకు చిత్ర పరిశ్రమలో భారీ క్రేజ్ ఉండటంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది.

Advertisement

ఇప్పుడు ఒక్కో పాటకు లక్షల్లో తీసుకుంటుంది.. సింగర్ మంగ్లీ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మనందరికీ తెలిసిన విషయమే. తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. కాగా సింగర్ మంగ్లీ ఒక్క పాటకు సుమారు 5 లక్షల తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా ఇటీవల పాడిన అన్ని పాటలు హిట్ అవ్వడంతో ఆ సంఖ్యను ఏడుగా చేసిందట..

అంతే కాకుండా సింగర్ మంగ్లీ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడుతున్నారు. సింగర్ మంగ్లీ రెమ్యూనరేషన్ చూస్తుంటే స్టార్ హీరోయిన్ కూడా తనకు సరిసాటి రారని అనిపిస్తోంది. ఇక సింగర్ గానే కాకుండా హీరోయిన్ కూడా తన సత్తాను చాటాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ ఫోటోషూట్లతో హోరెత్తేస్తోంది. ఇక సింగర్ గా మెప్పించిన మంగ్లీ హీరోయిన్ గా ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి..

Advertisement