Balakrishna: నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో తెలిసిందే.. కాగ ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. అయితే అందులో కూడా తప్పు వెతుకుతున్నారు కొంతమంది.. బాలయ్య క్షమాపణలు చెప్పినట్టే చెప్పి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఓ న్యూస్ క్రియేట్ చేశారు..
బాలయ్య వీరసింహారెడ్డి విజయోత్సవం స్టేజ్ పై మాట్లాడుతూ.. ఆ.. రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని అంటూ.. చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీ హీరోలకు వారి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.. అక్కినేని అభిమానులు బాలకృష్ణపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఈ విషయంపై బాలకృష్ణ స్పందించారు.. బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. నేను అక్కినేని నాగేశ్వరావు గారిని వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఎన్టీఆర్ ను ఏన్టివోడు అంటారు. నాగేశ్వరావు ను నాగయ్య అంటారు అది ప్రేక్షకుల అభిమానం.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసతో పిలుస్తూ ఉంటారు.. అదంతా ప్రేమ అభిమానంతో అనే మాటలను వాటిని పట్టించుకోరు.. వ్యతిరేకంగా చూడకూడదు. అక్కినేని నాగేశ్వరరావు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తాను..
పొగడ్తలకు పొంగిపోవద్దనే సిద్దాంతాన్ని ఆయన నుంచే నేను నేర్చుకున్నాను బాలకృష్ణ అన్నారు. నాగేశ్వరరావుకు నేనంటే చాల ఇష్టం. తన పిల్లల కంటే ఎక్కువగా నామీద ప్రేమ చూపించేవారు.. ఆప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి అంటూ వెటకారంగా నవ్వారు.. దాంతో నాగార్జునను ఉద్దేశించే బాలకృష్ణ ఇలా మాట్లాడారని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మరి కాసేపట్లో నాగార్జున ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనేది సామెత కావచ్చు.. కానీ ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు పై మళ్ళీ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. అసలు అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అనుకోవడం లేదని అనుకుంటా అంటూ బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ఒక్కసారి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పాన్నారు. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.. ఇక్కడితో ఈ విషయం మర్చిపోతే బాగుంటుందని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు.