Money Tips : కేవలం రూ.2 రూపాయలతో రూ.2 కోట్ల వరకు లాభం.. ఎలా అంటే..?

Money Tips : అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం పొందాలని ఆశించే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే కొంతమంది పోస్టాఫీసులలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, మరి కొంతమంది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది స్టాక్ మార్కెట్ లో డబ్బు లు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్కుతో కూడుకున్న పని అయినప్పటికీ లాభం మాత్రం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం పొందాలని ఆలోచించేవారికి మల్టీ బ్యాగర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇక ఇప్పుడు చెప్పబోయే ఒక స్టాక్ గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా కొన్ని మల్టీ బ్యాగర్ షేర్లు రాబడి లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక అలాంటి స్టాక్స్ లో ఫర్టిలైజర్ కంపెనీ రామ ఫాస్పేట్ స్టాక్ కూడా ఒకటి. ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్ లను కూడా అందించింది. ఇక ఈ స్టాక్ యొక్క హిస్టరీని గనుక మనం చూసుకున్నట్లయితే 108 రూపాయల ఒక్క షేరు విలువ ప్రస్తుత రూ. 361 పెరిగింది. అంటే 235 శాతం ర్యాలీ చేసి ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించింది.5 సంవత్సరాల కాల వ్యవధిలో చూసుకుంటే ఈ ధర రూ. 75 .95 నుంచి రూ.361 చేరుకుంది.

Profit of over Rs. 50,000 per month with this scheme
Profit of over Rs. 50,000 per month with this scheme

అంటే షేర్ హోల్డర్లకు 380 శాతం ర్యాలీ చేసి లాభాలను అందించింది అన్నమాట. 10 సంవత్సరాల వెనక్కి చూసుకుంటే 610 శాతం పెరిగింది. గత 19 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ షేర్ విలువ కేవలం 2 రూపాయలు మాత్రమే ఉండేది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు 361 రూపాయలకు ఎగబాకింది. ఒకవేళ మీరు కూడా సుమారుగా 19 సంవత్సరాల క్రిందట లక్ష రూపాయలు పెట్టి షేర్లను కొనుగోలు చేసి ఉంటే .. ప్రస్తుతం దాని విలువ రూ. 2 కోట్లు అయ్యి వుండేది . షేర్ మార్కెట్లో సుదీర్ఘకాల షేర్ లను ఎంచుకోవడం మంచిది. ఇక కొత్తగా స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.