Health Tips : కొర్రలు తింటే ఈ అనారోగ్య సమస్యలు పరార్..!

Health Tips : సంపూర్ణ పోషకాలు నిండిన చిరు ధాన్యాలలో కొర్రలు కూడా ఒకటి.. కొర్రలు లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.. కొర్రలు తింటే ఎటువంటి జబ్బులు తగ్గుతాయో ఇప్పుడు చూద్దాం..!కొర్రలలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటుంది. వీటిని అన్నంగా వండుకుని తినవచ్చు.

లేదంటే అట్టు, ఇడ్లీ, ఉప్మా ఇలా ఏ రకంగానైన తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా కూడా దీని ప్రయోజనాలను పొందవచ్చు. కొర్రలు తింటే డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దాంతో హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.

Health Tips Foxtail Millet Rice
Health Tips Foxtail Millet Rice

ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది. కొర్రలు తినడం వలన నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తింటే ఫలితం కనిపిస్తుంది. మెదడును చురుకుగా పని చేసేలా చేస్తుంది. మతిమరుపు ను పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్త హీనత సమస్యను తగ్గించి రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది.