Praveen.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస మరణాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల గుండెపోటు తో నందమూరి తారకరత్న మరణించిన విషయం మరువకముందే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. చిన్నవయసులోనే ప్రవీణ్ మరణించారన్న వార్త తెలుసుకొని సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
ప్రవీణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2017 లో వచ్చిన దర్శకుడు మూవీకి ప్రవీణ్ అనుమొలు సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు యువతలో కూడా వరుస గుండెపోటు మరణాలు చాలా కలవరపెడుతున్నాయి . అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తూ ఉండడం మరింత భయాందోళనకు గురిచేస్తోంది . ఏది ఏమైనా ప్రవీణ్ కూడా అంత చిన్న వయసులోనే అది కూడా గుండెపోటుతో మరణించడం మరింత విషాదకరమని చెప్పాలి.