TDP – YCP : టిడిపి ,వైసిపి ల అసలు గుట్టు రట్టు చేసిన ఐఏఎస్ రామాంజనేయులు..

మహిళలను డ్వాక్రా సంఘా లు చేసి వారిలో సాధికారికతను తీసుకువచ్చారని అన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం వైపుగా కూడా.. భూమి కొనుగోలు చేయడం ఉపాధి , విదేశీ చదువులు చదువుకోవడం , శాశ్వతమైన ప్రయోజనాలను ఇచ్చింది మాత్రం టిడిపి నే.. అని ఆయన అన్నారు.

మరి అలా అయితే జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లకే పెద్ద పీట వేస్తున్నామని అంటున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి అని రామాంజనేయులు ప్రశ్నించగా.. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. మన దగ్గర ఉన్న డబ్బులని సంక్షేమం పథకాలు తో పాటు మిగతా అవసరాలకు కూడా వెచ్చించాలి . కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే డబ్బులు ఇస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ప్రజలు ఏమైనా లాభపడ్డారు అంటే ఏమాత్రం లాభపడలేదు. కొన్ని ఆ డబ్బులను ఉపయోగించి మరో రూపాయిని సృష్టించగలుగుతున్నారా అంటే అది లేదు.

రాష్ట్ర ఆదాయంలో ఎక్కడైనా సేల్స్ టాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ సేల్స్ టాక్స్ కి పోటా పోటీగా ఎక్సైజ్ టాక్స్ నుంచి ఆదాయం వస్తుంది అంటే దీని అర్థం ఏమిటి అంటే.. ఏదైతే మనం నగదు రూపంలో ప్రజలకు ఇస్తున్నాము. వారి దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటున్నారు సారాయి రూపంలో.. మద్యపానం మీద కూడా ఈ ప్రభుత్వం టార్గెట్లను తీసుకువచ్చిందని రామాంజనేయులు గుర్తు చేశారు.