Prabhas : మూడవ ప్రపంచ యుద్ధం లో ప్రభాస్ .. అవతార్ 2 ని మించిన సినిమా రాబోతోంది !

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెగ అల‌రిస్తున్నారు. చివ‌రిగా సాహో, రాధే శ్యామ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇవి నిరాశ‌ప‌రిచాయి. ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ఆదపురుష్ విడుదలకు సిద్ధంగా ఉండగా ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌-K’ చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇక రీసెంట్‌గా ప్రభాస్ మరో బాలీవుడ్‌ దర్శకుడిగా చాన్స్ ఇచ్చినట్లు స‌మాచాచ‌రం. ‘వార్‌’, ‘పఠాన్‌’ ఫేం సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు తెలుస్తుండ‌గా, ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించ‌నుంది.

prabhas-participates-third-world-war
prabhas-participates-third-world-war

Prabhas :  భారీ అంచ‌నాల‌తో..

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న స‌లార్ చిత్రంతో పాటు ప్రాజెక్ట్ కె చిత్రంపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ కె చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నుండ‌గా, బ‌డా నిర్మాత అశ్వినీ దత్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కె అనే వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌కు జోడిగా దీపికా ప‌దుకొనే నటిస్తోంది. ఈ చిత్రం మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నుంద‌ట‌.

ప్రభాస్, దీపికా పదుకోణెల ఇద్దరూ మూడో ప్రపంచ యుద్దంలో పాల్గొంటార‌ని తెలుస్తుండ‌గా, . మూడో ప్రపంచ యుద్దంలో ఆపేందుకు ప్రభాస్ ని సూపర్ హీరోగా చేస్తారట‌ అమితాబ్. అమితాబ్ పాత్ర చాలా శక్తివంతంగా,కీలకంగా ఉంటుంద‌ని, అదే క‌థ‌ని మ‌లుపు తిప్పుంద‌ని చెప్పుకొస్తున్నారు. యాక్షన్ అభిమానులను ఆహ్లాదపరిచేలా ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఇందు కోసం హాలీవుడ్ కి చెందిన ఐదుగురు ఫైట్ మాస్ట‌ర్స్ ని రంగంలోకి దింపుతున్నాడ‌ట‌ నాగ్ అశ్విన్. ఒక్కో యాక్ష‌న్ సీక్వెన్స్ ఒక్కో ఫైట్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంద‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. అవ‌తార్ 2ని మంచి ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.