Men: సమస్యలకు లింగ బేధం ఉండదు. కాకపోతే మనం సమస్యలను ఎదుర్కొనే విధానం మాత్రం అందరిలో ఒకేలాగా ఉండదు. స్త్రీ, పురుషులందరికీ కూడా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ పురుషులే తక్కువ సమస్యలను ఎదుర్కొంటారు అని అంతా అనుకుంటారు. అంతేకాకుండా మగవారి ఏ సమస్య అయినా సులువుగా అధిగమించి ముందుకు వెళ్తారని మరికొందరి అభిప్రాయం. కానీ వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు వారికి కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యల కారణంగా పురుషులు ఎన్నో మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు.. అంతేకాకుండా డిప్రెషన్ లోకి వెళ్లి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో చూద్దాం..
సమస్యల వలయాలు..
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా మహిళలు దూసుకుపోతున్నారు .ఇది పురుషులను వెనక్కి నెట్టేస్తుంది .కానీ మనం ఎదుగుతూ ఇతరుల ఎదుగుదలలో కూడా మన సహకారాన్ని అందిస్తేనే మనకి ప్రయోజనాలు లభిస్తుందిి. మగవారు కచ్చితంగా ఉద్యోగం చేయాలనే నానుడి ఎప్పటినుంచో ఉంది .
నేటి తరంలో ఉద్యోగంతో పాటు ఆర్థిక భద్రత కూడా కాపుగా ఆడుకోవాల్సిన సమయం ఉంది. దాంతో పురుషులు యాంత్రికంగా జీవించడానికి అలవాటు పడిపోతున్నారు ఎలాంటి అనుభూతులు లేకుండా తరచూ విసిగితేందుతూ నిస్సారంగా జీవిస్తూ ఉంటారుు. జీవితంలో ఎదగాలనే ఆలోచనలతో సమస్యల వలయంలో చిక్కుకొని వాటిని చేదిస్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ ఆ టెన్షన్ లో పడి ఒత్తిడి, మానసిక ఆందోళనతో పాటు మిగతా సంతోషాల గురించి ఆలోచించలేకపోతున్నాడు. మనసుకు నచ్చిన వారితో సమయాన్ని గడపడం వల్ల ఎవరి జీవితమైనా ఉత్సాహంగా మారుతుంది.
పురుషులు చాలా సమయాల్లో రిజెక్షన్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ప్రేమ విషయంలోనే కాదు ఉద్యోగాలు , ప్రాజెక్ట్స్ , ఆర్థికపరమైన డీల్స్ ఇలా ఎన్నో విషయాల్లో వాళ్ళు రిజెక్షన్స్ ని ఎదుర్కొంటారు కానీ వాటి నుంచి పలు నేర్చుకోవాలి వారి తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలి అప్పుడే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు.
వారి అందం విషయంలోనూ ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు సవాళ్లను పురుషులు ఎదుర్కొంటారు. వారికి తగిన మెలకువలను సూచిస్తే వారు జీవితంలో ముందుకు వెళ్తారు. పురుషులు ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న కానీ వాళ్ళు నోరు విప్పి బయటకు చెప్పలేకపోతున్నారు .ఎదుటివారితో పంచుకోలేకపోతున్నారు.