Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమను కూడా ఒకరు.. ప్రస్తుతం తమన్ పేరు మారి మోగిపోతుంది.. తమన్ సంగీతం అందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు ఆస్కార్ అవార్డుకి ఎంపిక కావడం.. దాంతో తమన్ సంగీత బాణీలు అందరినీ అలరిస్తున్నాయి.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు ఎంపిక కావడంపై తమన్ స్పందిస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో మీరు సంగీతం సమకూర్చిన నాటు నాటు పాట ఆస్కార్ వరకు వెళ్లడం పై మీ స్పందన ఏంటి అని తమను అడుగగా.. మా డైరెక్టర్ త్రివిక్రమ్ మమ్మల్ని ఆస్కార్ అవార్డుకి తీసుకువెళ్తారు అంటూ చెప్పాడు.
దీంతో ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా తీయని త్రివిక్రమ్ మిమ్మల్ని ఆస్కార్ కు ఎలా తీసుకువెళ్తాడు అంటూ కొంతమంది ట్రోల్ చేయడం మనం చూస్తున్నాం .. ఈ విషయంలో ట్రోలర్స్, మీమర్స్ మరోసారి తమన్ అడ్డంగా దొరికిపోయడు. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా.. ఓ రేంజ్ లో ఈ విషయాన్ని వైరల్ చేస్తుంది. మహేష్ త్రివిక్రమ్ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రం కాదు మరి తమన్ ఎలా ఆ మాట అన్నాడు అంటూ సోషల్ మీడియాలో తమన్ ను నువ్వు దేవుడువి సామీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.