బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటిరోజు మొదటి షో నుండి దారుణమైన నెగిటివ్ ట్రోలింగ్ ను మూటకట్టుకొని మొదటి మూడు రోజులకుగాను 300 కోట్లు గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసి, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తరువాత వీకెండ్ ముగియడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. సినిమా బయ్యర్లకు నష్టం వాటిల్లకుండా బయట పడాలి అంటే మరో 200 కోట్ల పైనే కలక్షన్స్ వచ్చి తీరాలి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? అన్న అనుమానాలు చాలామందికి వున్నాయి. మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన మొదటి సోమవారం పరీక్షలో కొంతవరకు పాస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే ఎవరూ ఊహించని విధంగా ఈమూవీకి ఉత్తరాది ప్రాంతంలో మంచి కలక్షన్స్ వస్తున్నాయి. అందుకే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లమేర అయితే కలెక్షన్లు సాధిస్తుంది అని రెబల్ అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇక చాలామంది ‘ఆదిపురుష్’ మూవీకి నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం రావణ పాత్రను డిజైన్ చేసే తీరు అని చెబుతున్నారు. రావణాసురుడు లంక అత్యంత సుందరమైన బంగారు ప్రాంగణం అనీ పురాణాలలో వర్ణిస్తే ఓం రౌత్ దానికి భిన్నంగా ఒక డెన్ గా మార్చి ఎందుకు చూపెట్టాడు? అంటూ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక శివ పరమ భక్తుడైన రాణాసురుడి నుదుట విభూది రేఖలు ఉండవలసిన స్థానంలో చిన్న ఎర్రటి తిలకం ఎందుకు పెట్టారు? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులైతే మా అందమైన ప్రభాస్ ని ఇంత దారుణంగా ఎలా తెయారు చేసారు అంటూ దర్శకుడు ఓం రౌత్ మీద గుర్రుగా వున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎన్నో విషయాలలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో ‘ఆదిపురుష్’ మూవీ కలక్షన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి అన్న బాధ ప్రభాస్ అభిమానులలో అయితే విపరీతంగా కనిపిస్తోంది.
మరోపక్క ఈ సినిమాను చూసిన టాలీవుడ్ ప్రముఖులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో రామాయణాన్ని వక్రీకరించారని కొందరంటే, కనీసం పాత రామాయణ సినిమాల మాదిరిగా కూడా లేదంటూ కొందరు మండి పడుతున్నారు. మరికొందరంటే ఒక తెలుగు దర్శకుడు రామాయణాన్ని తీసుంటే చాలా అద్భుతంగా ఉండేదని, తెలుగు హీరోలు ఇంకెప్పుడూ బాలీవుడ్ దర్శకులను నమ్మకూడదు అంటూ సూచనలు ఇస్తున్నారు. ఇక ఇదే కోవలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయారు. తాజాగా ఈ సినిమాని తన సొంత థియేటర్ MB మాల్ లో తిలకించిన మహేష్ బాబు చాలా నిరాశకు లోనయ్యాడట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ బాలీవుడ్ దర్శకుడిని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాడంటూ సహచరుల దగ్గర ఫీల్ అయ్యాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.