9 నెలల కడుపుతో మహేష్ బాబు ఇంటికి వెళ్లిన ఇలియానా… బిత్తరబోయిన నమ్రత?

అందాల నడుము వంపుల సుందరి హీరోయిన్ ఇలియానా గురించి తెలుగు యువతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మంచి పీక్స్ లో వున్నపుడే అమ్మడు బాలీవుడ్ పిలిచింది కదాని ఏకంగా మకాం ముంబై కి మార్చేసింది. ఆ తరువాత అమ్మడు ఇక్కడ సినిమాలలో కనబడడం మానేసింది. అక్కడ మొదట్లో ఒకరి అరా సినిమాలు నడిచినా ఆ తరువాత వరుస ప్లాపులతో అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. ఆ తరువాత ఇల్లు బేబీ ఏకంగా సోషల్ మీడియాలోనే కనిపించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో నడుము వంపుల సుందరి కాస్త బొద్దుగా తయారైంది కూడా. కట్ చేస్తే…. పెళ్లి కాకుండానే తల్లై అభిమానుల గుండెల్లో గునపాలు దింపింది. అదంతా ఒకెత్తయితే దానికి కారణమైన వాడిని కూడా బయటకు తెలియకుండా దోబూచులాడుతోంది.

ఇల్లు బేబీ తెలుగులో ‘దేవదాసు’ అనే సినిమాతోనే అరంగేట్రం చేసినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి’తోనే సూపర్ స్టార్ డం సొంతం చేసుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. దానికి గాను ఆమెకి అవార్డులు కూడా వరించాయి. ఆ తరువాత కాలంలోనే ఆమె బాలీవుడ్ మీద మోజుతో ముంబై బాట పట్టింది. అయినప్పటికీ హీరో మహేష్ బాబుతో ఆమె స్నేహం కొనసాగిస్తున్నట్టు కనబడుతోంది. దానికి ఉదాహరణగా తాజా పరిణామాన్ని చెప్పుకోవచ్చు. అవును, 9 నెలల నిండు గర్భిణి హఠాత్తుగా మహేష్ బాబు ఇంటికి వెళ్లడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఇక హఠాత్తుగా ఇల్లు బేబీ రాకతో మహేష్ సతీమణి నమ్రత కూడా ఆశ్చర్యపోయినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇప్పటికీ మిస్టరీగా కొనసాగిస్తున్న ఇల్లు బేబీ గర్భానికి కారణం ఇక్కడ వెతికితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, కేవలం పలకరింపుగానే ఇలియానా మహేష్ ఇంటికి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదట ఈ విషయంపైన రూమర్లు వెలువడినప్పటికీ ఆ వెంటనే ఘట్టమనేని అభిమానులు అసలు విషయాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు. మచ్చలేని చంద్రుడిగా మహేష్ బాబుని చెప్పుకోవచ్చు. అలాంటి ఆయనమీద అబాండాలు వేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి?

ఇకపోతే రెండు మూడు రోజుల క్రితమే మొదటిసారి ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడింది. ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఇలియానా అనేక విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తల్లి కావడం గొప్ప వరమని, మన శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం గొప్ప అనుభూతిని పంచిందన్నారు. అలాగే తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని, వేదన నుండి బయటపడేలా చేశాడని, అండగా నిలిచి జీవితంలో నవ్వులు పూయించాడని, నా కడుపు పండడానికి కారణం కూడా ఆయనే అని ఇలియానా చెప్పుకొచ్చింది. అయితే ఎప్పటిలాగే ఆ వ్యక్తి పేరు మాత్రం ఇలియానా చెప్పలేదు. దీంతో ఇంకా ఆ విషయంపైన సస్పెన్సు కొనసాగుతుంది. హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ అని జనాలు చెప్పుకుంటున్నారు. ఆ విషయం మరి పెరుమాళ్ళకెరుక!