టాలీవుడ్ వర్ధమాన నటి ‘బేబీ’ వైష్ణవి గురించి ఇపుడు తెలుగు యువతకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అవును, కొన్ని సినిమాలు అనేవి కొందరకి మాత్రమే స్టార్డమ్ తీసుకువస్తాయి. అలా బేబి సినిమాలో చేసిన ఇద్దరు హీరోల సంగతి గురించి జనాలు ఇపుడు మాట్లాడుకోవడం లేదు. ఎక్కడ చూసినా హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే అంతా మాట్లాడుతున్నారు. ఆమె క్యారక్టర్ ఎంతలా కనెక్ట్ అయ్యిపోయిందంటే హోర్డింగ్ పై ఆమె ఫొటోని చెప్పుతో కొట్టేటంతలా అంటే మీరు నమ్ముతారా? ఇంతలా యూత్ లోకి వెళ్లిపోయిన అమ్మాయికి ఇపుడు టాలీవుడ్లో ఆఫర్స్ తన్నుకుంటూ వస్తున్నాయి. అయితే ఆమె ఆచి తూచి అడుగులు వేస్తోన్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏమంటే వైష్ణవి తన నెక్ట్స్ ప్రాజెక్టు ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో చేయనున్నట్లు వినికిడి. అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్‌లోనే అల్లు అరవింద్ ఇండైరక్ట్ గా చెప్పుకురావడం విశేషం. ఇదిలా ఉంటే వైష్ణవిని మరో పెద్ద ప్రాజెక్టులో తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లు శిరీష్ కమిటైన కొత్త చిత్రంలో వైష్ణవి కాంబోతో కలిపి మరో మూవీని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గా స్టేజిపై చెప్పుకురావడం అందరికీ తెలిసినదే. ఆయన సినిమాలో కీలకమైన రోల్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు అని చిన్న లీక్ ఇచ్చాడు కూడా. అంతలా నేడు బేబీ వైష్ణవికి మార్కెట్ ఏర్పడింది అనడంలో అతిశయోక్తిలేదు.
అవును టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్నా బేబి పేరే వినపడుతుంది. ఇక యువత అయితే వైష్ణవి అంటే పడిచస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చాలామంది ఆమెకి సోషల్ మీడియా వేదికగా ప్రపోజ్ చేస్తున్నారు కూడా. అసలు విషయంలోకి వెళితే… బేబీ సక్సెస్ హేంగోవర్లో వున్న మన బేబీ తనకు ఎలాంటివాడు భర్తగా రావాలో చెప్పకనే చెప్పేసింది. అవును, ఆమెకి అలాంటోడు… ఇలాంటోడు కావాలని పెద్దగా కోరికలు లేవట. అవును, కేవలం తనను అర్ధం చేసుకొనే మనస్తత్వం కలిగినవాడు వస్తే చాలట. అంతకు మించిన పెద్దపెద్ద కోరికలు తనకు లేవని చాలా సింపుల్ గా చెప్పుకొచ్చింది. దాంతో బేబీ అభిమానులు వైష్ణవి సింపుల్ సిటీకి ఫిదా అయిపోతున్నారు.
ఇకపోతే చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ సినిమా గురించి ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో విరాజ్ అనే మరో హీరో నటించాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా టైటిల్ పాత్రలో నటించింది. ఇక విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘కలర్ ఫొటో’ సినిమాకు కథ, నిర్మాతగా వ్యవహరించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ మూవీ హిట్ అవ్వడానికి హీరోయిన్ పాత్రను మలచిన విధానమే కారణం. ప్రేమ పేరిట ఇద్దరు అమ్మాయిలను ఎలా మోసం చేస్తుంది అనేదే ఈ సినిమా. చాలామంది యువత ఈ సినిమాని తమ రియల్ లైఫ్ కి ఎక్కువగా కనెక్ట్ చేసుకోవడం వలన ఓ కల్ట్ ఫాలోయింగ్ ఈ సినిమాకి ఏర్పడిందని చెప్పుకోవచ్చు.