I Phone : వావ్..ఐ ఫోన్ కేవలం రూ.3,599.. ఆఫర్ పొందాలంటే..!!

I Phone : వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా.. లేదా ఇదంతా ఫేక్ అని కొట్టిపడేస్తున్నారా..? మీరు ఎలా అనుకున్నా ఇదే నిజం అని చెప్పాలి. ఎందుకంటే ఐఫోన్ కొనాలని ఆలోచించేవారికి ఇది ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఐ ఫోన్ కేవలం రూ.3599 రూపాయలకే లభిస్తోంది. కళ్ళు చెదిరే ఆఫర్ ను సొంతం చేసుకోవాలి అంటే మీరు ఇలా చేయాల్సిందే. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ ఈ అద్భుతమైన ఆఫర్ ను తమ కష్టమర్ల కోసం తీసుకురావడం జరిగింది.. ఇక బెస్ట్ ఫ్లిప్కార్ట్ డీల్స్ లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 13 ను ఎవరు కూడా నమ్మలేని ధరతో విక్రయించడానికి సిద్ధంగా ఉంది ఫ్లిప్ కార్ట్. ఇకపోతే ఐఫోన్ 13 128 GB వేరియంటును ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి పెట్టడం జరిగింది.

ఇక దీని అసలు రూ.79,900 కాగా ఫ్లిప్ కార్ట్ లో ఈ ఐ ఫోన్ ను ఏకంగా 7 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.74,209 కి తగ్గింది. ఫ్లిప్ కార్ట్ లో ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్ కింద ఐఫోన్ 13 ను మీరు చాలా తక్కువ ధరకే ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇకపోతే ఈ- కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 13 ను ఈఎంఐ ఆప్షన్స్ కింద ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఐఫోన్ 13 ను కొనుగోలు చేయాలనుకునే వారిలో ఎస్బిఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉండి కొనుగోలు చేయాలనుకుంటే ఐఫోన్ 13 ను కేవలం రూ.3,599 కే కొనుగోలు చేయవచ్చు. ఇక 15% వడ్డీ రేటు తో నెలకు రూ.3,599 చెల్లించాలి.

I phone only at Rs.3,599 to get this offer
I phone only at Rs.3,599 to get this offer

ఇక ఈ లెక్కన చూసుకుంటే మీరు 24 నెలల్లో అంటే ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఐఫోన్ 13 ధర మొత్తాన్ని పూర్తిగా చెల్లించవచ్చు. ఒకవేళ మీరు వాయిదా పద్ధతిలో కాకుండా లేదా ఈఎమ్ఐ ఆప్షన్ మీకు వర్తించకపోయిన సరే ఐఫోన్ పై అదిరిపోయే తగ్గింపులతో కూడా పొందే అవకాశం ఉంటుంది.. ఒకవేళ మీకు ఈఎమ్ఐ ఆప్షన్ లభించకపోతే.. రూ.23,000 కంటే ఎక్కువ తగ్గింపుతో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం 7 శాతం తగ్గింపుతో రూ.74,209 అయితే.. ఇక యాక్సి స్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.3,711 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.70,498 వరకు తగ్గుతుంది. ఇంకా మీరు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా పొందవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 13 ను రూ.55,998 కి సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే రూ.23,902 రూపాయల భారీ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనే అవకాశం లభించబడింది.