గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటి జ్యోతి రాయ్ ఇటీవల కాలంలో వార్తల్లో బాగా నిలుస్తోంది. అందుకు కారణం లేటు వయసులో ఈ ముద్దుగుమ్మ యువ దర్శకుడు సుకుపుర్వాజ్‌తో ప్రేమలో పడటమేనని చెప్పవచ్చు. ఇటీవల, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. లేటు వయసులో ప్రేమలో పడటం సెలబ్రిటీలకు కొత్తేం కాదు. జ్యోతి రాయ్ కూడా అదే పనిలో ఉంది.
జ్యోతి రాయ్ 20 ఏళ్ల వయసులో నెట్‌వర్కింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. జ్యోతి రాయ్ 38 సంవత్సరాల వయస్సులో ఉంది, సుకుపుర్వాజ్ 30 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. వారు మధ్య 8 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. అయినా ప్రేమ పెళ్లికి వయస్సు అడ్డు రాదని వీరు పబ్లిక్‌గానే రొమాన్స్ చేసుకుంటూ ప్రపంచాన్ని మరుస్తున్నారు.
జ్యోతి రాయ్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన అందాలను షో చేస్తోంది. ప్రియుడుతో కలిసి రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తోంది. ఆమె తన ట్విట్టర్ ఖాతాకు జ్యోతి పుర్వాజ్ అని పేరు కూడా మార్చింది. దాంతో వీరిద్దరికీ అఫీషియల్ గా పెళ్లయిపోయిందా అనే కోణంలో అనుమానాలు మొదలయ్యాయి. జ్యోతి రాయ్, సుకుపుర్వాజ్ రెండో పెళ్లి అనేది బుల్లితెర రంగంలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి విషయంపై వారు అధికారికంగా త్వరలోనే ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇకపోతే సుకుపుర్వాజ్ ఓ చిన్న దర్శకుడు. అతను ‘ఏ మాస్టర్ పీస్’, ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. జ్యోతి రాయ్, సుకుపుర్వాజ్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వారు తమ ప్రేమను హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రకటించారు. వారు ఈ నెల ప్రారంభంలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.