మహేష్ బాబు ఋణం ఎప్పటికీ తీర్చుకోలేము అనంటున్న జీవిత రాజశేఖర్?

పరువు నష్టం కేసులో ఇరుక్కున్ననాటినుండి సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులు తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వారు చేసిన ఆరోపణలకు, దాఖలైన పరువు నష్టం దావా పై విచారణ జరిపిన కోర్టు ఇటీవల వారికి నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష, 5000 రూపాయలు జరిమానా విధించింది. ఇకపోతే, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన ఎంతోమందికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు. అయితే సినీ నటులు జీవిత, రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

2011లో ఒక ప్రెస్ మీట్లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై పైరకంగా సంచలన ఆరోపణలు చేశారు. దాంతో వారి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టులో కేసు వేశారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎంతోమందికి సహాయం దొరుకుతుందని, అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలపైన, చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవిత రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సిడి రూపంలో కోర్టుకు సమర్పించారు.

దీంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఇటీవల సంచనలన తీర్పును వెల్లడించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ విషయమై జీవిత, రాజశేఖర్ ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతో పాటుగా, 5000 రూపాయలు జరిమానా విధించింది. ఇకపోతే ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో జరిమానా చెల్లించిన వారిద్దరు నుంచి పూచీకత్తులను సమర్పించి బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. అయితే ఈ కేసులో జిల్లా కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్న జీవిత రాజశేఖర్ కు అక్కడైనా పరిస్థితి అనుకూలంగా మారుతుందో లేదో భవిష్యత్ లో తేలాల్సి వుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే, చిరంజీవి – మహేష్ బాబు మధ్య ఎలాంటి బంధం ఉంటుందో వేరే ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. ఈ కష్టకాలంలో తమని కాపాడేది మహేష్ బాబేనని నమ్ముతున్న జీవిత రాజశేఖర్ తాజాగా వారి ఇంటికి వెళ్లి తమ గోడుని వెళ్లబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. దానికి మహేష్ నేనున్నానని, చిరంజీవిగారితో మాట్లాడి విషయం సెటిల్ చేస్తానని ఆయనిది చాలా మంచి మనసు అని వారికి నచ్చజెప్పి పంపాడట సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి వీరి పంచాయితీ ఎంతవరకు వస్తుందో చూడాలి మరి. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి విదితమే.