SSC Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..SSCలోఉద్యోగాల జాతర..!!

SSC Jobs : కేంద్ర ప్రభుత్వం వరుసగా పలు ఉద్యోగాలలో నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ ఉన్నది. ఇప్పటివరకు ఎన్నో ఖాళీలు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఈ రోజున భారత ప్రభుత్వం పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్..SSC నుండి మల్టీ టాస్కింగ్, స్టాఫ్ హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను ఖాళీల సంఖ్య.. జీతభత్యాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Good news for the unemployed Job in SSC
Good news for the unemployed Job in SSC

1). మొత్తం ఖాళీల సంఖ్య..3603
ఇందులో నాన్ టెక్నికల్, మల్టీ టాస్కింగ్ పోస్ట్ లు కలవు.

2).జీతభత్యాలు : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి రూ.75,000 రూపాయలు ఇస్తారు.

3). వయస్సు: అభ్యర్థుల వయసు జనవరి 1-2022 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. మిగతా వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది.

4). అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సు లో ఉత్తీర్ణత అయి ఉండాలి.

5). ఎంపిక విధానం : అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

6). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి.

7). దరఖాస్తు ఫీజు: : జనరల్/ఓబీసీ అభ్యర్థులు.. రూ.100 రూపాయలు. ఎస్సీ/ఎస్టి/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

8). దరఖాస్తు ముఖ్యమైన తేదీలు : 1).దరఖాస్తుకు చివరి తేదీ.. ఏప్రిల్ 30.
2). ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ.. మే 2.
3). చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ.మే 3
4). కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష టియర్-1 .. జులై నెలలో ఉంటుంది.

అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి https://ssc.nic.in/ దరఖాస్తు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం ముఖ్యం.