పొరపాటున కూడా ఇతరుల నుంచి ఈ వస్తువులను తీసుకోకండి..!!

సాధారణంగా ఇరుగుపొరుగు అన్న తర్వాత ఇంట్లో వస్తువులను,  సరుకులను ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు. అలాగే ఆఫీసులోనూ.. వేరే ఇతర వ్యాపారాలలో కూడా డబ్బు సహాయం కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే కష్టం, నష్టం,బాధ వచ్చిన వారికి అవసరానికి అనుగుణంగా సహాయం చేస్తూ ఉంటారు. ఇక తమ దగ్గర లేనిది ఎదుటి వారి దగ్గర ఉంటే అడిగిమరీ తీసుకోవడం  ప్రతి  ఒక్కరికి కామన్ గా మారిపోయింది. అయితే మీరు కూడా ఇతరుల నుంచి ఏవైనా వస్తువులను తీసుకునేటట్లు ఉంటే వెంటనే ఆ అలవాటును మానుకోండి. ఎందుకంటే అది మిమ్మల్ని తీవ్ర ఇబ్బంది లోకి నెట్టి వేసే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇతరులను ఏదైనా అడిగి వస్తువులను తీసుకున్నట్లయితే వాటిలోని ప్రతికూల శక్తి మీ లోపలికి చొరబడుతుంది. తాత్కాలికంగా ప్రయోజనం చేకూరినప్పటికీ కాలం గడిచే కొద్దీ అనేక రకాల నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే  మీ దగ్గర లేకపోయినా సరే ఇతరుల నుంచి ఏ వస్తువులను కూడా  తీసుకునే అలవాటుంటే వెంటనే మానుకోండి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల నుంచి కొన్ని వస్తువులను ప్రత్యేకంగా తీసుకోకపోవడమే మంచిది. వాటిలో ముఖ్యంగా గడియారం కూడా ఒకటని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల నుంచి గడియారం తీసుకొని ధరించవద్దు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి ధరించిన వాచి ని మీరు ధరించినట్లయితే ఆ వ్యక్తి యొక్క చెడు ప్రభావం ..

Do not take these items from others even by mistake
Do not take these items from others even by mistake

అతని గడియారం ద్వారా మీకు చేరే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే ఒకరు వేసుకున్న దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధరించవద్దు.  ఎందుకంటే వారు వేసుకున్న దుస్తుల ద్వారా నెగటివ్ ఎనర్జీ తో పాటు ఆ వ్యక్తి శరీరంలో ఉండే బ్యాక్టీరియా కూడా మీకు చేరి అనారోగ్యం పాలవుతారు. ఇక చెప్పులు,  బూట్లు వంటివాటి వల్ల పేదరికం తాండవిస్తుంది అట. ఆఖరికి పెన్ కూడా ఇతరుల నుంచి తీసుకోకూడదు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే ఒకరు ధరించిన ఉంగరాలను మరొకరు ధరించడం వల్ల ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం, జీవితం , ఆర్థిక స్థితి కూడా దిగజారుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.