Business Idea : మండే ఎండల్లో.. నీడ లో వుంటూ లక్షల్లో ఆదాయం..ఎలా అంటే..?

Business Idea : మండే ఎండల్లో.. నీడలో ఉంటూ లక్షల్లో ఆదాయం పొందడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? నిజమే కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపించినా.. వేసవికాలంలో విపరీతంగా అమ్ముడుపోయే ఐస్ క్రీమ్ గురించి ఇప్పుడు మేము మీతో చర్చించబోతున్నాం.. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది ఇంట్లో ఉంటూనే ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనా లాంటి మహమ్మారి వైరస్ లకు భయపడి బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం తగ్గినప్పటికీ ప్రజలలో ఆందోళన మాత్రం పెరిగిపోతోంది. ఇక రోజు రోజుకి కరోనా మళ్లీ కొత్తగా రూపాంతరం చెంది ప్రజలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది జాగ్రత్త గా ఉండండి అంటూ ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.ఇక ఈ నేపథ్యంలోనే బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయలేక ఆర్థికంగా అభివృద్ధి చెందలేక కనీసం తినడానికి కూడా తిండి లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.

అలాంటి వారు ఇంటి నుండి డబ్బు సంపాదించాలని ఆలోచించడం లో ఏమాత్రం తప్పులేదు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది ఇతరుల మీద ఆధారపడకుండా ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.అయితే తక్కువ డబ్బులతో ఎటువంటి బిజినెస్ చేస్తే మీరు మంచి లాభాలను పొందవచ్చు అనేది చాలా మందికి అవగాహన లేదు అని చెప్పాలి. మీరు చేసే బిజినెస్ మీద అవగాహన లేకపోవడం వల్లే నష్టాలను చవి చూడడం తప్ప మరొకటి లేదు. ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపారం చేయడానికి సిద్ధమవుతున్నట్లు అయితే ఆ వ్యాపారం గురించి పూర్తి వివరాలను.. మార్కెట్ ను కూడా బట్టి ఆ వ్యాపారం చేయడం మంచిది. ముఖ్యంగా మీరు కూడా బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ..ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియకపోతే మీ కోసం ఒక చక్కటి ఆదాయాన్నిచ్చే బిజినెస్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ బిజినెస్ పెట్టడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు గురించి కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం.

Business Idea on Ice cream parlor Business
Business Idea on Ice cream parlor Business

సీజన్ కి అనుగుణంగా వ్యాపారం చేయడం అనేది చాలా ఉత్తమమైన ఎంపిక.ఈ రోజులలో దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన వేడి పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది ఐస్ క్రీమ్ తయారు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా లాభం చాలా ఎక్కువగా ఉండే ఈ ఐస్క్రీమ్ వ్యాపారం వల్ల నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ కి వేసవికాలంలో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఇక ఈ బిజినెస్ చేయడానికి కేవలం మీకు 10,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. వ్యాపారం కొద్దీ ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఇక దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ వ్యాపారం ఎక్కువగా సాగుతోంది అయితే ఈ వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు 300 నుండి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్క్రీమ్ పార్లర్ ను ప్రారంభించవచ్చు. ఇక ఇందులో పదిమందికి సీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇక ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా బిలియన్ పైగా ఐస్క్రీం వ్యాపారం జరుగుతోంది ఇక ఈ బిజినెస్ కి మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఇకపోతే మీ స్థలంలో తయారు చేసిన ఆహార పదార్థాలు, దాని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ తో చేసే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఐస్ క్రీమ్ వ్యాపారం మీకు మంచి లాభాలను ఇవ్వడమే కాకుండా మరెంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కూడా కలుగుతుంది. ఇక ఐస్ క్రీమ్ తయారీ విధానం తెలుసుకొని మీకు దగ్గర్లోనే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి మంచి లాభాలను పొందవచ్చు. ఇక అలా మండే ఎండల్లో.. నీడలా ఉంటూ లక్షల కొద్దీ లాభాలను పొందే అవకాశం ఉంటుంది.