Business Idea : లక్షల్లో ఆదాయం కావాలంటే ఇలా చేయాల్సిందే..?

Business Idea : సాధారణంగా ఎవరైనా సరే ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు అంతకంటే దీనమైన పరిస్థితి ఇంకొకటి లేదు అని చాలా మంది చెబుతుంటారు. నిజానికి ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా ఒక మనిషి ఇంకొక వ్యక్తి పైన ఆధారపడవలసి వస్తుంది అని అందరికి తెలిసిందే అయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలి అంటే అందుకు చక్కటి పరిష్కారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వాటిలో పాడి పశువులు ఒకటి అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ పాలు , పాల ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి డైరీల పైన ఆధార పడుతున్నారు. కానీ పూర్వకాలంలో అలాగే ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలా మంది రైతన్నలు తమ వ్యవసాయ పనులు చేసుకుంటూనే.. మరొక పక్క పాడి పశువులను కూడా పోషిస్తున్నారు. ఇంట్లో పాడి పశువులు అంటే మంచి ఆదాయంతో పాటు ఆనందం కూడా లభిస్తుంది.

Advertisement

అందుకే రైతన్నలు తప్పనిసరిగా పశువులను పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఆవులు, గేదెల నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి అమ్మి లాభాలను పొందడమే కాకుండా పశువుల నుంచి వచ్చే పేడ కి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇటీవల కాలంలో చాలా మంది యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఉద్యోగాలు లేని వారు ఇలా చిన్న బడ్జెట్ తో మొదలయ్యే వ్యాపారాలు చేయడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు. ఇక అందులో ఆవు పేడ కూడా ఒకటి. ఇటీవల ఒక యువకుడు ఆవుపేడతో పలు రకాల వస్తువులను తయారు చేసి ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్నారు. నిజానికి ఆవు పేడ ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఇంటిముందు ఆవుపేడతో కల్లాపి చల్లడం వల్ల బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు ఇంట్లోకి ప్రవేశించలేవు. పైగా ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా ఉంటారు. ఇకపోతే గోదానం గా పేరొందిన ఆవుపేడతో తయారు చేసిన వస్తువులను అమ్మి ప్రతినెల లక్షల్లో లాభాలను పొందుతున్నారు.

Advertisement
If you want income in lakhs, you have to do this
If you want income in lakhs, you have to do this

ఇటీవల రాయపూర్ కి చెందిన ఏక్ పహల్ సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఆవుపేడతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తూ ప్రతి నెల మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే అతని దగ్గర మూడేళ్లుగా ఆవుపేడతో ఎన్నో ఉత్పత్తులు తయారు చేసి అమ్మడానికి ఎంతో మంది కార్మికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎంతో మందికి మంచి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. ఇతని దగ్గర సుమారు 400లకు పైగా ఆవులు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇటీవల చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపెస్ బఘెల్ ఇటీవల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇకపోతే ఆయన ఇటీవల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇక ఆ బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చిన బ్రీఫ్ కేస్ ఆవుపేడతో తయారు చేసినట్లు సభాముఖంగా తెలిపి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే వారు. ఈ బ్యాగ్ పై పెద్ద చర్చ జరిగింది. ఇక బృందం మొత్తం పది రోజుల్లో ఈ బ్యాగులు తయారు చేసి ఇచ్చింది.

ఇకపోతే పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేశారు. కానీ అనారోగ్యానికి గురవుతున్న ఆవులను వీధిలో చూసి చలించిపోయిన పరిస్థితి చూసి తట్టుకోలేక 2015 ఉద్యోగానికి రాజీనామా చేసి పశువుల కోసం ప్రత్యేకంగా గోదాము ను నిర్మించాడు. ఇక గోశాలలో ఆవులను పోషిస్తూ వాటి నుంచి డబ్బు సంపాదించే ఆలోచన చేశాడు. ఆ రోజు నుంచి ఆవు పేడ తో చెప్పులు, పర్సులు, బ్యాగులు, శిల్పాలు, దీపాలు, రంగులు , ఇటుకలు ఇలా ఎన్నో తయారు చేయడం మొదలు పెట్టాడు. తర్వాత వాటిని విక్రయిస్తూ వ్యాపారంగా మార్చుకున్నాడు. తన వ్యాపారం అభివృద్ధి చెంది ప్రతి నెల మూడు లక్షల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. అంతే కాదు అతను మరో 23 మందికి ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం గమనార్హం. భవిష్యత్తులో తన బిజినెస్ ను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు రితేష్. వృధా గా పోయే ఆవుపేడతో ఇలా అద్భుతమైనవి సృష్టించి మరెన్నో విజయాలను సాధిస్తున్నారు.

Advertisement