Business Idea : గాడిదలతో ఏకంగా లక్షలు సంపాదిస్తున్న ఇంజనీర్.. ఎలా అంటారా..?

Business Idea : వ్యాపారం చేయాలి అంటే కాస్తోకూస్తో చదువుకుంటే సరిపోతుంది. అయితే ముఖ్యంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు చేసే వృత్తి మీద మంచి పట్టు ఉండడమే కాకుండా ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచనలను దూరంగా పెట్టాలి. లక్ష్య సాధనకై పాటుపడిన అప్పుడే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఇక ఇప్పటికే చాలామంది ఉన్నత చదువులు చదివి ,ఉద్యోగాలు చేస్తూ డబ్బు సరిపోక.. మనశ్శాంతి లేక.. ఉన్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఇంటి దగ్గర ఉంటూ.. మంచిగా తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకుంటూ లక్షల్లో డబ్బు పొందుతున్నారు. ఇక వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే చాలు దానంతట అదే మొదలుపెట్టడానికి దారులు ఏర్పడతాయి. అయితే మీరు ముందుగా ఎలాంటి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో ఆ వ్యాపారం గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇక లాభనష్టాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

నిపుణుల సలహా సైతం తీసుకొని ఏదైనా వ్యాపారం మొదలు పెడితే నష్టాన్ని కొని తెచ్చుకునే బదులు లాభాల బాట పట్టవచ్చు. ఇకపోతే ఉన్నత చదువులు చదివిన ఎంతో మంది విద్యావంతులు తమ ఉద్యోగాలను వదిలి వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక ఇంజనీర్ మాత్రం తన ఉద్యోగానికి స్వస్తి పలికి ఏకంగా గాడుదులు కాస్తున్నారు. వినడానికి సిల్లీగా ఆశ్చర్య కరంగా అనిపించినా..అతడు మాత్రం గాడిదలను బిజినెస్ గా చేసుకొని వాటి పాల ద్వారా కొన్ని లక్షల రూపాయలను సొంతం చేసుకుంటున్నాడు. మరి ఆ ఇంజనీర్ యొక్క వ్యాపార విజయం గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. ఇకపోతే లక్షల్లో శాలరీ వదిలి.. సొంత ఊరికి వచ్చేసి ఆవులు, గేదెలు, కోళ్ల ఫారం, మేకలు ఏర్పాటు చేశాడు ఆ యువకుడు. దీంతోపాటు గాడిదలకు ఒక ఫారం కూడా ప్రారంభించాడు. ఇక ఈ ఇంజనీర్ స్టోరీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. కర్ణాటకలోని ఇరా గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

Business Idea Engineer making millions with donkeys
Business Idea Engineer making millions with donkeys

ఇక లక్షల్లో సాలరీ కూడా తీసుకునేవాడు. కానీ పని ఒత్తిడి కారణంగా ఆ ఉద్యోగంలో శాటిస్ఫ్యాక్షన్ లేదని 2020లో తన ఉద్యోగానికి స్వస్తి పలికాడు. ఇక తనకున్న 3 ఎకరాల్లో పశువుల ఫారాలను ఏర్పాటు చేశాడు. ఇక మరొకవైపు గాడిదల ఫారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన ఈయన ఆలస్యం చేయకుండా గాడిదల కోసం ఒక షెడ్డు ను కూడా ఏర్పాటు చేసి వాటి పోషణ చూసుకో సాగాడు. అయితే మొదట్లో ఇతడు చేసిన పనికి ఊరి వారంతా నవ్వుకున్నారు. కానీ శ్రీనివాస్ గౌడ్ అవేవి పట్టించుకోకుండా ఫారం ఏర్పాటు చేసి గాడిద పాలలో ఉండే ఔషధ గుణాలు.. అనేక రకాల రోగాలను తగ్గించే గుణాలు ఉంటాయి అని గుర్తించాడు. ఇక గాడిద పాలను బ్యూటీ పార్లర్ ప్రొడక్ట్స్ లో కూడా వినియోగిస్తారని తెలుసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఇతడి దగ్గర 20 వరకు గాడిదలు ఉన్నాయి .ఇక అతని దగ్గర పశువులు, మేకలు, కుందేళ్లు, కడక్నాథ్ కోళ్లు, గాడిద ఫారం లు కూడా ఉండడం గమనార్హం.

ఇక ప్రస్తుతం తన గాడిద ల నుంచి వస్తున్న పాలలో 30 ml గాడిద పాల ధర సుమారుగా 150 రూపాయలకు విక్రయిస్తున్నాడు. అంతేకాదు సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ , షాప్స్ వంటి పెద్ద పెద్ద వాటికి కూడా తమ పాలను సరఫరా చేస్తున్నాడు. అంటే ఒక లీటరు రూ.5 వేల రూపాయలు కు గాడిద పాలను విక్రయిస్తున్నాడు ఈ ఇంజనీర్.. ఇక ఈ క్రమంలోనే ఒక ప్రముఖ కంపెనీ రూ.17 లక్షల రూపాయల విలువ చేసే గాడిద పాల కోసం ఆర్డర్ కూడా ఇచ్చిందట. ఇక ఇలా శ్రీనివాస్ కష్టానికి మంచి ఫలితం లభించడంతో ఊరి ప్రజలు సైతం ఆయనను ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇంకా ఈయన బిజినెస్ ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. జీవితంలో నచ్చని పని చేయడం కంటే నరకం ఇంకోటి ఉండదు. అందుకే ఎవరు ఏమనుకున్నా నచ్చిన పని చేయడంలోనే సంతృప్తి ఉంటుందని నిరూపించారు ఈ ఇంజనీరు.