Airtel Recharge Plan : ఎయిర్టెల్ నుంచి మరో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్.!!

Airtel Recharge Plan : ఎయిర్టెల్.. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టడమే కాకుండా మరో టెలికాం దిగ్గజం సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో కి గట్టి ప్రయత్నాలు ఇవ్వడానికి భారతి ఎయిర్టెల్ శాయ శక్తులా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకర్షించే దిశగా మరోసారి కొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇక ఆ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు అలాగే ఆ ప్లాన్ ద్వారా మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు. ఇలా అన్ని విషయాలను చదివి తెలుసుకుందాం. ఇక తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఎయిర్టెల్ సరికొత్త ప్లాను తీసుకురావడం జరిగింది.

ఒకవేళ మీ బడ్జెట్ కేవలం రూ. 300 కంటే తక్కువగా ఉంటే కంపెనీ మీకోసం ఒక మంచి ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మనలో చాలామంది ముందుగా బడ్జెట్ చూసిన తర్వాతనే ఎలాంటి ప్లాన్ అవసరమో రీఛార్జ్ చేసుకుంటాము. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజ భారతీ ఎయిర్టెల్ లో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను అమలు చేసింది. ఇక మీ బడ్జెట్ ధర రూ.300 కంటే తక్కువగా ఉంటే.. మీకోసం ఒక మంచి ప్లాన్ కూడా ఉంది. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎయిర్టెల్ అందిస్తున్న ట్రూలీ అన్లిమిటెడ్ జాబితాలో చాలా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రూ.300 కంటే తక్కువ ధర కలిగిన ప్లాన్ ల గురించి మాట్లాడినట్లయితే.. రూ.296 యొక్క గొప్ప ప్లాన్ ను ఎయిర్టెల్ మీకు అందిస్తోంది.

Benefits of another new recharge plan from Airtel
Benefits of another new recharge plan from Airtel

ఇక ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు అంటే అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 25GB 4G హై స్పీడ్ డేటా ను పొందవచ్చు. ఒకవేళ డేటా అయిపోతే యూజర్లు ఒక MB కి 50 పైసలు చొప్పున చార్జ్ అవుతుంది. ఒకవేళ మీకు అవసరం అయితే ఇటువంటి 25 GB డేటాను ఒకేరోజు ఖర్చు చేయవచ్చు. కస్టమర్లు పూర్తి నెల రోజులు అంటే 30 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఇతర విషయాలకు వస్తే 30 రోజులు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్.. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్, షా అకాడమీ క్లాసు తో అప్ స్కిల్స్, ఫాస్ట్ ట్యాగ్ పై వంద రూపాయల క్యాష్ బ్యాక్, ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ తో పాటు హలో ట్యూన్స్ లను కూడా ఉచితంగా పొందవచ్చు.