Vastu Tips : వాస్తు ప్రకారం సాయంత్రం ఈ పనులు చేస్తే దరిద్ర దేవత ఆహ్వానిచ్చినట్టే..!

మన హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని పనులు సాయంత్రం పూట చేయరాదని పండితులు, పెద్దలు హెచ్చరిస్తారు. సాయంత్రం పూట ఆ పనులు చేయడం వల్ల దరిద్రాన్ని కొని తెచ్చుకోవడమే అంటుంటారు.ప్రతి పనికి ఒక టైం అనేది ఉంటుంది. ఏ టైం లో ఎం చెయ్యాలి..చెయ్యకూడదు అనే విషయం తెలుసుకున్నవాల్లు జీవితంలో గొప్ప సక్సెస్ అందుకుంటారు. కొందరు టైమ్ కుదరక ఉదయం చేసేది రాత్రి, రాత్రి చేసే పని వేరే రోజుకు చెయ్యడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా.సూర్యోదయం మరియు సూర్యాస్తమయం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం మీరు ఎప్పటికీ చేయకుండా ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

మీరు ఈ వాస్తు నియమాలను పాటిస్తే, మీరు మీ జీవితంలో ఆనందాన్ని పొందడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు..సాయంత్రం వేళ ప్రతికూల నెగటివ్ ఎనర్జీ చురుగ్గా లోపలికి ప్రవేశిస్తాయి.అందుకే ఇంట్లో ఈ సమయంలో పూజలు చేస్తే ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా చేస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించడం చాలా మంచిది.తులసిని లక్ష్మీదేవి ప్రతి రూపంగా భావిస్తారు, కాబట్టి తులసిని సరైనా సమయంలో పూజిస్తే..ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ వరిస్తుంది. మీరు సాయంత్రం పూట తులసిని పూజించవచ్చు, అయితే ఈ సమయంలో మొక్కకు నీరు పోయడం మర్చిపోవద్దు.. ఇంటిని శుభ్రంగా ఉంచడానికి సాయంత్రం కూడా తమ ఇళ్లను తుడిచివేస్తారు, కానీ సూర్యాస్తమయం సమయంలో లేదా తర్వాత తుడుచుకోవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

Vastu Tips doing these things in the evening is the goddess of poverty
Vastu Tips doing these things in the evening is the goddess of poverty

ఇది లక్ష్మికి కోపం తెప్పించింది. సాయంత్రం పూట నింద్రించ కూడదు.ఇలాంటి సోమరిపోతులకు లక్ష్మి చాలా దూరంగా ఉంటుంది.. ఇకపోతే చాలా మందికి సమయానికి ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో ఆహారానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి.సాయంత్ర సమయంలో భోజనం చేయకూడదు.ముఖ్యంగా మాంసం మరియు చేపలకు దూరంగా ఉండాలి..సాయంత్రం వేళ బిక్షాటన వచ్చిన వారికి ఖాళీ చేతులతో తిరిగి పంపకండి, మీ స్తోమతను బట్టి, ఏదైనా దానం చేయాలి.. సాయంత్రం వేళ లక్ష్మి ఇంటి ప్రధాన గడపవద్దకు వస్తుందని చెబుతారు. అటువంటి పరిస్థితిలో, ఒక ఇంటి తలుపు మూసి ఉంటే, అప్పుడు లక్ష్మి ఆగ్రహించి తిరిగి వెళ్ళి పోతుంది . దీంతో డబ్బుకు కొరత ఏర్పడి ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది .సాయంత్రం డబ్బులు ఎవ్వరికి అప్పుగా ఇవ్వకూడదు .ముఖ్యంగా లక్ష్మి వారం సాయంత్రం అస్సలు అప్పు ఇవ్వరాదు..