Money: ఈ చిన్న పనులు చేస్తే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవడం ఖాయం..!!

Money: ఎవరైనా సరే డబ్బు వస్తోంది అంటే చాలు గౌరవానికి తగ్గ పని చేయడానికి వెనకాడరు. కారణం డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరు పలు రకాల మార్గాలను ఎంచుకుంటారు. ఒకవేళ శ్రమకు తగ్గట్టుగా డబ్బు పొందే లేకపోతే మనసులో నిరుత్సాహంగా ఉంటుంది. అంతే కాదు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ఆ డబ్బు మీ వద్ద ఎక్కువ కాలం నిలవకపోయినా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే డబ్బు పొందడానికి జ్యోతిషశాస్త్రంలో కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలను చెప్పడం జరిగింది. ఇక మీరు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారికి ఈ ఆర్టికల్ ను  షేర్ చేసి సమాచారాన్ని అందించవచ్చు.

All you have to do is do these small things .. it is sure to rain money at home .. !!
All you have to do is do these small things .. it is sure to rain money at home .. !!

ముఖ్యంగా ఒక వ్యక్తి ఆర్థిక బాధల నుంచి విముక్తి పొందాలి అంటే జ్యోతిషశాస్త్రంలో కొన్ని విషయాలను చెప్పడం జరిగింది.. అవేమిటంటే

ఇంట్లో తులసి మొక్కను నాటడం..
హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను నాటడం వల్ల ఆ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది అట . అంతేకాదు లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు.

గురువారం ఉపవాసం:
ముఖ్యంగా గురువారం రోజు ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. సంపద , శ్రేయస్సు దేవత గా పరిగణించే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆ వ్యక్తికి ఆర్థిక సమస్యలు అనేవి ఎప్పటికీ ఉండవు. ముఖ్యంగా గురువారం రోజు ఉపవాసం చేస్తూ లక్ష్మీనారాయణ పారాయణం చేయడం , శ్రీ మహావిష్ణువు.. లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

ప్రతి రోజు దీపారాధన:
ఇంట్లో పూజ గదిలో ఉదయం, సాయంత్రం దీపం వెలగడం వల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అంతేకాదు దీపం వెలిగించేటప్పుడు అందులో కొద్దిగా ఎర్రటి దారం కూడా వేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది.

శివలింగానికి జలాభిషేకం:
ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలి అంటే నిత్యం నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి . అలాగే బెల్లము , అక్షతలు , పాలు సమర్పించడంవల్ల పరమశివుడు మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు.

ముఖ్యంగా పౌర్ణమి రోజున చంద్రుడిని పూజించడంవల్ల ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.