Aparna: సురారై పోట్రు సూర్య అపర్ణ బాలమురళి జంటగా నటించిన ఈ సినిమా.. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదలైంది.. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో.. అపర్ణ బాలమురళి జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి ఆ పాట ఇప్పటికీ అందరి నోట్లలో మెదులుతూనే ఉంది.. ఈ సినిమాలో అపర్ణా బాలమురళి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. కాగా తాజాగా అపర్ణకి ఓ చేదు అనుభవం ఎదురయింది..
తను నటించిన ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా కాలేజీకి వెళ్లిన అపర్ణ పట్ల ఓ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. దానిని చూసిన పలువురుని నెటిజన్స్ యువకుడి ప్రవర్తన పై మండిపడుతున్నారు.. అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం తన్కమ్.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు వినీత్ శ్రీనివాసన్ తో కలిసి ఆమె కేరళలోని ఓ లా కాలేజీలో సందడి చేశారు..
అపర్ణ స్టేజ్ పై ఉండగా ఓ విద్యార్థి ఆమె దగ్గరకు నేరుగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తరువాత ఆమె చేయి పట్టుకుని పైకి లేపి ఆమె భుజంపై చేయి వేయబోయాడు. వెంటనే అతడి ప్రవర్తనను గమనించిన అపర్ణ బాలమురళి అతడి నుంచి తెలివిగా తప్పించుకుంది. అయితే ఆ యువకుడు అనుచిత ప్రవర్తనకు అందరూ కంగుతిన్నారు. అతడి నుంచి అపర్ణ వాళ్ళ మురళి వెంటనే దూరంగా జరిగింది. ఈ ఘటనపై అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆ విద్యార్థి తిరిగి స్టేజ్ పైకి వచ్చి ఆమెకు క్షణ క్షమాపణలు చెప్పాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాంతో నెటిజన్స్ ఆ యువకుడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎదుట వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో ముందుగా తెలుసుకోవాలి. చేయాల్సింది అంతా చేసేసి ఇప్పుడు క్షమాపణలు చెప్పడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అపర్ణ మురళీకృష్ణ కి ఈ లా విద్యార్థితో చేదు అనుభవం ఎదురైంది.