BREAKING : బాలయ్య సినిమా లో సింగర్ సునీత !!

BREAKING : నందమూరి నటసింహం బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బీకె 108 వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా ప్రారంభించారు.. తాజాగా ఈ సినిమాలో సింగర్స్ సునీత ఓ కీలక పాత్రలో నటిస్తుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Advertisement
Singer Suneetha acting on balakrishna NBK movie intresting update
Singer Suneetha acting on balakrishna NBK movie intresting update

షైన్ స్క్రీన్ బ్యానర్స్, సాహు గారిపాటీ ఈ భారీ బడ్జెట్ చిత్రం ను నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో జైలు సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లోనే మొదటి షెడ్యూల్‌ లో భాగంగా 12 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఓ కొత్త లుక్‌ని డిజైన్ చేశారంట.

Advertisement

ఆయన స్టార్ డమ్ కు తగ్గట్టుగా యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసుకున్నట్లు. మునుపెన్నడూ చూడని విధంగా తెరపై బాలయ్యను చూపించబోతున్నట్టు హామీనిచ్చారు అనిల్. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల నటించనుంది. హీరోయిన్ల విషయంలో ప్రియమణి, తదితర సినీయర్ హీరోయిన్ల పేరు కూడా వినిపిస్తోంది. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో స్టార్ సింగర్ సునీత కూడా ఓ కీలకపాత్రలో నటించిన ఉందట అయితే బాలకృష్ణ కి సపోర్టింగ్ క్యారెక్టర్ గా నటిస్తుందని సమాచారం అలాగే సునీత ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పనుందట అంతేకాకుండా తన వాయిస్ తో ఈ సినిమాలో ఓ పాట కూడా పాడనుందట.

 

Advertisement