SmartPhone : 108 MP కెమెరాతో బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..!!

SmartPhone : ఏ వినియోగదారుడైనా సరే స్మార్ట్ ఫోన్ విషయంలో అన్ని ఫీచర్స్ ఉండాలి కానీ ధర తక్కువ ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించడంలో తప్పులేదు ఇక అలాంటి వారి కోసమే ఇప్పుడు తాజాగా ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి ఫ్లిప్కార్ట్ ఒక మంచి శుభవార్త తీసుకొచ్చింది అని చెప్పవచ్చు . ప్రస్తుతం మోటోరోలా డేస్ సేల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకే అందించడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ లో 108 ఎంపీ క్వాడ్ ఫిక్షన్ కెమెరాను కూడా అమర్చడం గమనార్హం. ముఖ్యంగా ప్రైజ్ , ప్రొసీజర్ తో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.

ఫ్లిప్కార్ట్ ప్రకటించిన మోటోరోలా డేస్ సేల్ త్వరలోనే ముగియబోతున్న నేపథ్యంలో ఆఫర్ లో ఫోన్ కొనాలనుకునేవారు వెంటనే త్వరపడండి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 6 జీబీ అలాగే 128 జీ బీ స్టోరేజ్ వేరియంట్ తో మనకు లభిస్తుంది. ఇక దీని ప్రారంభ ధర రూ.21,499 కాగా ఫ్లిప్కార్ట్ లో మోటోరోలా డేస్ సేల్ నుండి మీరు రూ.3,500 వరకు భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17,999కే లభిస్తుంది. ఇక ఇతర ఫీచర్ విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి తోపాటు రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది.90 Hz రిఫ్రెష్ రేటుతో పాటు హెచ్డిఆర్ 10 + సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేను ఈ స్మార్ట్ మొబైల్ కలిగి ఉంటుంది..

5G Smartphone at a budget price with a 108 MP camera
5G Smartphone at a budget price with a 108 MP camera

ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 800 U ఆక్టా కోర్ 5G ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.ఇక 8 జిబి ర్యా మ్ కూడా జతగా లభిస్తుంది. ఇక ఈ మొబైల్ కలర్ విషయానికి వస్తే సైబర్ టీ యల్ తో పాటు ఎలక్ట్రిక్ గ్రాఫైట్ అని రెండు అందమైన రంగులలో మీకు లభిస్తుంది ఇకపోతే కెమెరా సెట్ అప్ విషయానికి వస్తే 108 ఎంపీ ప్రధాన కెమెరా.. 8mp అల్ట్రా వైడ్ సెన్సార్ తో పాటు 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.. ఇక 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అమర్చబడి ఉంది.30 W టర్బో పవర్ పాస్టర్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక టైపు సి చార్జర్ ని కూడా పొందవచ్చు.