Electric Tractor : త్వరలో మార్కెట్లో విడుదల కానున్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్.. ఫీచర్స్ ఇవే..!!

Electric Tractor : భారత దేశంతో పాటు విదేశాలలో కూడా ఇంధన వనరుల కొరత ఏర్పడుతుందని.. ముందు ఆలోచనతో ఇప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక భారత మార్కెట్లో కూడా చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు.ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. కానీ వినూత్నంగా ఆలోచించిన హైదరాబాద్ స్టార్ట్ అప్ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను రూపకల్పన చేసింది.

ఇక ఈ ఎలక్ట్రిక్ టాక్టర్ యొక్క ఫీచర్స్ అన్ని ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. ఇక ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ విషయంలో ఆసక్తి కనుబరుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ కి చెందిన స్టార్ట్అప్ Celestial e- mobility దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను తయారు చేయడానికి ముందుకొచ్చింది. ఇకపోతే ఈ ఈ – ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే తయారు చేయడం గమనార్హం.. ఇకపోతే హైదరాబాద్ కి చెందిన సిద్దార్థ్ దురైరాజన్ అండ్ సయ్యద్ ముబాశీర్ ఇలా వినూతమైన ఐడియా తో ముందుకొచ్చి వినోతమైన ఐడియా గురించి వెల్లడించారు.

Electric Tractor will released in the market very soon the features
Electric Tractor will released in the market very soon the features

ఇకపోతే హైదరాబాదులో స్టార్ట్ అప్ ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే Celestial e- mobility, pre -Series A ఫండింగ్ రౌండ్ లో 5 లక్షల ఫండ్ ను సేకరించడం జరిగింది . ఇక ప్రస్తుతం వ్యవసాయ పనులకు కావలసిన అన్ని అవసరాలను తీర్చడానికి ఈ ట్రాక్టర్ అనువుగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ముఖ్యంగా అగ్రి , ఏర్పోర్ట్ గూడ్స్ క్యారియర్ రంగాల అవసరాలకు మాత్రమే ఈ ట్రాక్టర్ పనికొస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాదులో 35 వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ మెక్సికన్ కంపెనీ గ్రూపు మార్వెల్స తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక త్వరలోనే అన్ని ఫీచర్స్ తో పాటు అద్భుతమైన ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.