High Blood Pressure : అధిక రక్తపోటు.. ఇటీవల కాలంలో కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న సమస్య ఇది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు, నిద్రలేమి, ఒత్తిడి వివిధ కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య ఎక్కువ అవుతోంది. దాంతో పెరిగిన రక్తపోటు స్థాయిలను అదుపులోకి తీసుకురావడానికి ఎక్కువగా మందులు వాడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని ఆహార పదార్థాలతో కూడా హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఆకుకూరలు అందుకు చాలా చక్కగా సహాయపడతాయి. మరి ఆ ఆకుకూరలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బచ్చలి కూర ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. హై బీపీ ఉన్నవారు కనీసం వారానికి రెండు సార్లు బచ్చలి కూర తినడం వల్ల హై బీ పీ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా పాలకూర కూడా హై బీపీని అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పాలకూర తిన్నా సరే సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక పుదీనా కూడా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వాంతులు, వికారం వంటి సమస్యలు దూరమవుతాయి.
రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అధిక వేడి కూడా తగ్గిపోతుంది. ఇక చాలామంది కరివేపాకును తినడానికి అస్సలు ఇష్టపడరు. కరివేపాకు ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని కూడా పెంచుతుంది.ఇక ప్రతిరోజూ మీరు వంటలలో ఉపయోగించే కరివేపాకులను తింటే చాలు రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇక మరీ ఎక్కువ సమస్యతో బాధపడుతున్నట్లైతే ఉదయాన్నే కొన్ని కరివేపాకు ఆకులను నములుతూ రసం మింగడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలియాలి అంటే ముందుగా ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.