Fishs : కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మానవుల గురించి ముఖ్యమైన మాంసాహార పదార్ధాలను కూడా ఒకటి. చేపలను తినడం వల్ల కొవ్వు పదార్థాలు తక్కువగా లభించే పోషకాలు అధికంగా లభిస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా కేశ సంరక్షణకు కూడా సహాయపడతాయి. ఇక వయసు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మతిమరుపు అనేది సాధారణ జబ్బుగా మారిపోయింది.
సమస్య ఎక్కువ అయితే ఆల్జీమర్స్ కు దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి బయట పడాలి అంటే తప్పకుండా చేపలు తింటే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇక అమెరికా శాస్త్రవేత్తలు 2016లో జరిపిన ఒక అధ్యయనంలో చేపలను తినడం వల్ల మెదడు చాలా బాగా పనిచేస్తుంది అని, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని వారు నిరూపించడం జరిగింది. మానసిక ఆందోళనతో బాధపడేవారు చేపలను తినడం వల్ల సమస్య తొలగిపోతుందట. ఒత్తిడి కూడా చేపలు తినడం వల్ల తగ్గే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ తో బాధపడే వారు కూడా చేపలు తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. గుండె జబ్బుల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. చేపలను బాగా తినడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. చేపలలో ఉండే ఒమేగా త్రీ వల్ల శరీరంలో రక్తనాళాలలో ఎటువంటివి అడ్డం పడకుండా పనిచేస్తాయి.మీలో ఎవరైనా సరే చేపలను తినడానికి ఇష్టపడకపోతే అలాంటి వారికి ఈ ఆర్టికల్ వాట్సప్ లేదా ఫేస్బుక్ షేర్ చేసి చేపల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా అందించవచ్చు.