Beauty Tips : మొటిమల తాలూకు వచ్చే మచ్చలు తొలగించడం ఎలా..?

Beauty Tips : వాతావరణంలో కాలుష్యం.. తినే ఆహారంలో పోషకాల లోపం.. ముఖ్యంగా మహిళలలో పోషకాహార అసమతుల్యత వంటి ఎన్నో కారణాల వల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏదో రకంగా ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత మొటిమలను తొలగిస్తాము.. కానీ మొటిమల తాలూకు మచ్చలు మాత్రం తొలగించడం చాలా కష్టమైన పనిగా మారిపోయింది. ఇక మొటిమల తాలూకు మచ్చలను తొలగించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ నల్లటి మచ్చలు కారణంగా ముఖం చాలా అందవిహీనంగా మారుతుంది.

అలాంటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తొలగించడానికి కీరదోస , బార్లీ పిండి చాలా చక్కగా పని చేస్తాయని చెప్పవచ్చు. ముందుగా కీరదోస పైన చెక్కు తీసి కీర దోసను మెత్తటి పేస్టులాగా గ్రైండ్ చేయండి. ఇందులో కొద్దిగా బార్లీ పిండి కలిపి సుమారుగా ఇరవై నిమిషాల పాటు నాన బెట్టండి. దీనిని ముఖానికి అప్లై చేసే ముందు శుభ్రంగా ముఖాన్ని కడుక్కుని ఆ తర్వాత ముఖంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అరగంట ఆగిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. వారానికి కనీసం 3 లేదా 4 సార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల మొటిమల తాలూకు మచ్చలను తొలగించుకోవచ్చు.

Beauty Tips The best treatment to get rid of acne scarring
Beauty Tips The best treatment to get rid of acne scarring

అంతే కాదు చర్మం తెల్లగా మారి పోయి అందంగా నిగనిగలాడుతూ ఉంటుంది. అంతేకాదు కీరదోస వల్ల చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ కూడా లభిస్తుంది.ఇక శరీరానికి అవసరమయ్యే నీటిని తాగడం , తాజా పండ్లు, కూరగాయలు లాంటివి ఆహారంలో భాగంగా చేసుకోవడం , వ్యాయామం, యోగా చేయడం, బయటకు వెళ్లిన ప్రతిసారి సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం లాంటి వాటి పనుల వల్ల ముఖం పైన వచ్చే మచ్చలను దూరం చేసుకోవచ్చు. ప్రతి మహిళ కి ఉపయోగపడే ఇలాంటి ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.