Health Benefits : బంగారం కంటే విలువైన మామిడి టెంక పారేయకండి..! ఈ లాభాలు మిస్స్ అవుతారు..

Health Benefits : వేసవికాలం వచ్చిందంటే మామిడి సీజన్ మొదలైనట్టే.. పండ్లకు రారజైన మామిడి పండు పోషకాల నిలయం.. ఈ పండు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. సాధారణంగా మనం మామిడి కాయలు తిని టెంక లో ఉంటాం. కానీ ఈ టెంక వలన లో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆ ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు మామిడి టెంకను అస్సలు పారెయ్యారు..!

మామిడి కాయలో ఉండే టెంకను తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడికి సమన మోతాదులో జీలకర్ర, మెంతుల పొడి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతిరోజు భోజనం చేసే మొదటి ముద్దలో వేసుకుని అన్నం తినాలి. ఇలా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి టెంక కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.

Surprising Health Benefits Of Mango Nuts
Surprising Health Benefits Of Mango Nuts

మామిడి టెంక పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ కడుపులో మంట వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మామిడి టెంక పొడిని మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. గొంతు గరగర, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఈ పొడిలో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. ఈ పొడి తీసుకుంటే దంత ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.