Fry Recipe : ఈ ఫ్రై గనక మీరు వండితే .. మీ ఆయన పిల్లలూ మిమ్మల్ని రోజంతా పొగుడుతారు !

Fry Recipe :  దొండకాయ ఫ్రైనూ చాలా మంది ఇష్టపడుతుంటారు. వేడి వేడి అన్నంలో దొండకాయ ప్రైను వేసుకొని దానిపై నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దొండకాయ ఫ్రై , కూర తిని తిని బోరు కొట్టిన వారు కొత్త రెసిపీ చేసుకోవాలనుకున్న‌వారు ఈ దొండకాయ 65 ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలకు, పెద్దలకు అందరికి నచ్చే విధంగా ఉంటుంది. ఈ వంటకం ఫంక్షన్స్, పెళ్లిళ్లలో ఈ రెసిపీని తప్పకుండా పెడతారు.దీనిని పప్పు, సాంబార్లో సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ దొండకాయ 65 కి ఈ రెసిపీకి దొండకాయ 65 అనేది పేరుకు మాత్రమే ఉంటుంది. కానీ దొండకాయ 65 తయారు చేసే విధానం మిగతా 65 రెసిపీ లాగా ఉండదు. దీనికి దొండకాయ 65 కి బదులు దీనిని దొండకాయ ఫ్రై అంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

టిప్స్ : దొండకాయలను లేతవి తీసుకుంటే బాగుంటుంది. అలాగే దొండకాయలు ముక్కలు త్వరగా వేగుతాయ్. దొండకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో నీళ్లని పోసి దానిలో దొండకాయలను వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత దొండకాయలను తీసి ఒక జల్లెడలో వాటిని వేయడం వల్ల దొండకాయలలో నీరు పోయి గాలికి ముక్కలు తొందరగా ఆరతాయి. 65 కరకరలాడుతూ ఉండాలంటే: ఈ దొండకాయ 65 చేయడానికి వాడే పిండి పొడిగా ఉండాలి. బజ్జీల పిండి లాగా అస్సలు ఉండకూడదు. ఒకవేళ పిండి జారు లాగా అయితే ఆ పిండి దొండకాయ ముక్కలకు పట్టుకోదు. వీటిని నూనెలో వేయగానే పిండి మొత్తం విడిపోతుంది.

If you cook this fry, your children will praise you all day long
If you cook this fry, your children will praise you all day long

ఈ దొండకాయ ముక్కలలో పిండి వేసిన తరువాత దీనిలో నీళ్ళను వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దొండకాయల్లో ఉండే వాటరే సరిపోతుంది. ఇలా కలిపిన తరువాత దొండకాయ ముక్కలను నూనెలో వేసిన తరువాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయిస్తే ఈ ముక్కలు లోపలి దాకా వేగుతాయి. అలా వేగిన తరువాత స్టవ్ ని హై ప్లేమ్ మీద పెట్టి కరకరలాడే వరకు వేయించాలి. అంతే దొండకాయ 65 రెడీ అవుతుంది. కావాల్సిన పదార్థాలు: లేత దొండకాయలు -1/2 kg, వేపుకోవడానికి – నూనె,
సెనగపిండి – 1/2 కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ -2 స్పూన్స్, తగినంత ఉప్పు, కారం – 1/2 స్పూన్,
పసుపు- 1/4 స్పూన్, అల్లం – 2 ఇంచ్, జీలకర్ర- 1 స్పూన్ పచ్చి మిర్చి – 7-8, వేరుశనగ గుండ్లు – 1/4 కప్పు, కరివేపాకు – 2 రెబ్బలు, వేయించిన జీలకర్రపొడి – 1/2 స్పూన్, గరం మసాలా- 1/2 స్పూన్ తయారు చేసే

విధానం: 1. దొంకాయ ముక్కలను సన్నగా కట్ చేసి వాటిని నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి. 2. తర్వాత ముక్కలను తీసి జల్లెడలో వేసి గాలికి ఆరనివ్వాలి. 3. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు (8-10) ను తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయాలి. 4. దొండకాయ ముక్కల్లో జీలకర్ర, ఉప్పు, పసుపు, అల్లం, పచ్చి మిర్చి పేస్ట్, కారం, సెనగ పిండి, బియ్యం పిండిని వేసి ముక్కలను మెదపకుండా నెమ్మదిగా పిండిని కలుపుకోవాలి. అవసరమనిపిస్తే కొన్ని నీళ్లను చల్లండి. 5. 8-10 నిమిషాల పాటు దొండకాయ ముక్కలను మరిగే నూనెలో వేసి స్టవ్ నీ మీడియం ప్లేమ్ లో పెట్టి వేయించండి. 6. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ముక్కల రంగు మారేవరకు వేపుకోండి. 7. అదే వేడి నూనెలో వేరుశనగ గుండ్లను, కరివేపాకును వేసి వీటిని వేయించిన దొండకాయ ముక్కల్లో వేయండి. 8. వీటిని కలిపిన తరువాత వీటిలో జీలకర్ర పొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపండి. ఇంకెందుకు ఆలస్యం అందరికీ ఎంతో ఇష్టమైన దొండకాయ 65 రెడీ అవుతుంది.