Beauty Tips : మెడ భాగం నల్లగా మారిపోయిందా.. అయితే ఈ చిట్కా పాటించండి..!!

Beauty Tips : ఎవరైనా సరే అమ్మాయిలు ముఖం అందంగా ఉండాలని.. మేకప్ వేసుకోవడానికి కూడా వెనుకాడరు. అయితే సహజంగా అందంగా ఉండాలనుకునే వారు ఇంట్లో వంటింటి చిట్కాలను పాటిస్తూ.. నిదానంగా తమ అందాన్ని పెంపొందించుకుంటారు. నిజానికి అమ్మాయి ముఖం ఒక్కటే అందంగా ఉంటే సరిపోదు. మెడ , గొంతు అన్నీ కూడా అందంగా కనిపించినప్పుడే పూర్తి అందం రెట్టింపవుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది అమ్మాయిలు , అబ్బాయిలు తేడా లేకుండా ప్రతిఒక్కరికీ మెడ భాగం పూర్తిగా నల్లగా మారిపోయింది.

చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. బిజీ లైఫ్ స్టైల్లో తమకు తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తీసుకోలేక పోతున్నారు ఆడవారు కూడా. ఇక ఇలా ఎవరైనా సరే మెడపై నలుపు గా ఉండి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండిఇక ఎలాంటి చిట్కాలను పాటించాలి.. చిట్కా కోసం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి.. అనే విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

if the neck is black then follow these tips to get rid of the problem prv
if the neck is black then follow these tips to get rid of the problem prv

Beauty Tips : ఇక మాస్క్ కోసం కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే..

శెనగపిండి :1 టేబుల్ స్పూన్
బియ్యం పిండి : 1 టేబుల్ స్పూన్
పాలు : 2 టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
తేనె : 1 టేబుల్ స్పూన్

తయారీ, వాడే విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, గొంతుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇక ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేసిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ మెడకు రాయాలి.వారానికి రెండు సార్లు ఈ చిట్కాలను పాటించినట్లైతే తప్పకుండా ఫలితాలు ఉంటాయి. అంతే కాదు క్రమం తప్పకుండా రెండు మూడు నెలలపాటు పాటిస్తే కనుక పేరుకుపోయిన మట్టి తొలగిపోయి.. నలుపుదనం తగ్గి చర్మం ఛాయను పొందుతుంది.