Health Tips : వేడికి చెక్ పెట్టే దివ్యౌషధం ఇదే..?

Health Tips : ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా చేసేది మాత్రం పెరుగును ఎక్కువగా తినడం. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది మన కడుపు లోకి వెళ్ళిన తర్వాత చల్లగా ఉండేలా చేస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా పెరుగులో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల దీనిని అల్పాహారంగా తీసుకోవచ్చు. అయితే పెరుగు వల్ల ఇప్పుడు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.

1). ఈ వేసవికాలంలో చర్మాన్ని, శరీరాన్ని చల్లబరిచేందుకు పెరుగు ఒక దివ్య ఔషధం. పెరుగులో జింక్, ప్రోబయోటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ నుంచి ఇవి రక్షిస్తూ ఉంటాయి. వడ దెబ్బ తగిలిన వారికి పెరుగును కూడా శరీరానికి అందించవచ్చు.

Health Tips heat check Yogurt is a divine medicine
Health Tips heat check Yogurt is a divine medicine

2). వేసవికాలంలో చర్మ సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. పెరుగు చర్మాన్ని యవ్వనంగా ఉంచడం కోసం పెరుగు ఫేస్ ప్యాక్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో కాస్త పెరుగు, శెనగపిండి, పసుపు కలుపుకుని ముఖానికి పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3). శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు పెరుగును కాకుండా మజ్జిగ ను తీసుకోవడం మంచిది. ఇది అలసట నుండి విముక్తిని ఇస్తుంది. మజ్జిగ మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. ఇక అంతే కాకుండా అధిక బరువుతో బాధపడే వారు ప్రతి రోజూ ఒక గ్లాస్ మజ్జిగ ను తీసుకోవడం మంచిది. మజ్జిగలో కాస్త జీలకర్ర, నల్లటి ఉప్పు, కొత్తిమీర వేసుకోవడం మంచిది.

4). ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎండలు మనం శరీరం మీద పడగానే జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతూ ఉంటోంది. మీరు ప్రతిరోజు మీ శిరోజాలకు పెరుగును పట్టించి స్నానం చేయడం వల్ల పొడిబారిన జుట్టు నుండి విముక్తి పొందవచ్చు. పెరుగు తో పాటుగా కాస్త కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకోవడం తలకు మంచిది.