కోడి గుడ్లు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందా.. నిజమేనా..!!

ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో కొన్ని చేయవలసినవి.. చేయకూడని పనులు కూడా ఉంటాయి. అయితే ఆహారంలో కొన్ని పదార్థాలను తప్పకుండా చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే అలాంటి వాటిని మితిమీరి గా తింటే చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అలాంటి వాటిలో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్ల లో అధిక కొలెస్ట్రాల్ ఉంటుందని వాటిని తినడం వల్ల అది మన శరీరానికి అధిక బరువు వస్తుందని అందరూ అపోహపడుతుంటారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈ విషయాన్ని పోషకాహార నిపుణురాలు అయిన అంజలి ముఖర్జీ తెలియజేయడం జరిగింది. ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ తాజాగా సురక్షితమైనది.

కేక్ మిశ్రమాలలో, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, డీహైడ్రేట్ అయిన పాలు, ఫ్రై చేసిన మాంసం, గుడ్డు ఆక్సీడైజ్ అయినప్పుడు మాత్రమే ఇది విషము ఆహారంగా మారుతుందట. ఇందులో కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెంది అది ధమనులలో అడ్డుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తెలియజేసింది. మీరు సాధారణ కొలెస్ట్రాల్ ఉండే వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇలాంటి వారు ప్రతిరోజూ ఒక గుడ్డు తిన్న కొలెస్ట్రాల్ కంట్రోల్ గా ఉంటుందని తెలియజేసింది.ఒకవేళ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారు కోడిగుడ్డులోని తెల్లసొనను మాత్రమే తినడం మంచిదట. గుడ్డులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుండెజబ్బుల ప్రమాదం నుంచి బయట పడవచ్చని ఎన్నో అధ్యయనాలలో తేలాయి అని ముఖర్జీ తెలియజేసింది.

Does eating hen eggs increase fat
Does eating hen eggs increase fat

1). కోడి గుడ్డు లో ముఖ్యంగా అత్యుత్తమైన నాణ్యతమైన ప్రోటీన్ కలదు.

2). రక్తంలో చక్కెరను సహాయం చేయడానికి కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది.

3). తక్కువ బ్లడ్ ఉన్నవారు కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది.

4). శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఖనిజాలను కోడిగుడ్డు కలిగి ఉంటుంది.