Health Tips : శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ఎలాగో తెలుసా..?

Health Tips : ఇటీవలి కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే వివిధ ఆహారాలను ప్రయత్నిస్తూ డైట్ లో కచ్చితంగా జ్యూస్ ని కూడా ఉండేలా చూసుకుంటున్నారు. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు ప్రతి ఒక్కరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు కూడా రుచికరమైన జ్యూస్లను ఇంట్లోనే తయారు చేసుకొని తాగుతూ బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి ఏ రసాలు ఉపయోగపడతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

నారింజ రసం : ఆరెంజ్ పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు ఆరోగ్యకరమైన నారింజ రసం తాగడం వల్ల ప్రతిరోజు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడమే కాకుండా చర్మ సంరక్షణ , జుట్టు సంరక్షణ కూడా పెంపొందించుకోవచ్చు.

క్యారెట్ రసం : క్యారెట్ రసంలో కూడా కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి . అలాగే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కలుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక క్యారెట్ రసం చేసేటప్పుడు నారింజ రసం , అల్లం , ఆపిల్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపి తాగితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు కూడా బయటకు వెళ్లిపోతాయి.

Health Tips Do you know how to dissolve body fat
Health Tips Do you know how to dissolve body fat

పైనాపిల్ రసం : బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి పైనాపిల్ రసం ఒక ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు. ముఖ్యంగా పైనాపిల్ లో ఉన్న బ్రోమేలైన్ అనే ఒక ఎంజైమ్.. ప్రోటీన్ ను మెటబాలైజ్ చేయడానికి చాలా సహాయపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది.

కాకరకాయ రసం, దోసకాయ రసం, దానిమ్మ రసం, ఉసిరికాయ రసం కూడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతాయి.