Hair Tips : ఒత్తైన , పొడవైన జుట్టు కావాలంటే ఇలా చేయాల్సిందే..?

Hair Tips : పొడవైన , ఒత్తైన జుట్టు కావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే.. షాంపూని ఆచితూచి ఎంచుకోవాలి అని.. ముఖ్యంగా హెయిర్ ఎక్స్పర్ట్ లు మీకు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే వారు ఇచ్చే సలహా మీరు ఉపయోగించి షాంపు మార్చమని. ఇకపోతే ప్రతిరోజు షాంపూ చేయడం వల్ల కాల్పుల్లో ఉన్న సహజమైన ఆయిల్ స్ట్రిప్ను పొడిగా చేస్తుంది అలాగే రఫ్ గా నిర్జీవమైన జుట్టుకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఇందుకోసం మీరు అధిక షాంపూలు తగ్గించాలని మొదటి సలహా ఇస్తూ ఉంటారు.మనలో చాలా మంది రోజు మార్చి రోజు షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటారు.

కొంతమంది ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ తల స్నానం చేస్తే జుట్టు రఫ్ గా మారి నిర్జీవంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జుట్టు త్వరగా ఊడిపోవడం, రాలిపోవడం , చిట్లిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒత్తైన , పొడవైన జుట్టు ను పొందాలంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు సమస్యలు మరింత అధికమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.ఇక మీరు రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూ లో సల్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డిటర్జెంట్ గా పని చేసినప్పటికీ నిర్జీవంగా మారుస్తుంది. కాబట్టి సల్ఫేట్ తక్కువగా ఉండే షాంపూలను వాడాలి.

This is what you need to do if you want deep, long hair
This is what you need to do if you want deep, long hair

ఇక తేలికపాటి షాంపూ లను ఉపయోగించడం వల్ల జుట్టు చాలా మృదువుగా మారే అవకాశం ఉంటుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే ఇంటి చిట్కాలు పాటిస్తే తప్పకుండా జుట్టు పెరుగుతుంది. ముఖ్యంగా హెయిర్ మాస్క్ విషయానికొస్తే గోరింటాకు, మందారం ఆకు మెత్తగా రుబ్బి , జుట్టుకి హెయిర్ ప్యాక్ వేస్తే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా నిగనిగలాడుతూ మెత్తగా ఉంటుంది. షాంపూలు కూడా మార్కెట్లో దొరికే వాటికంటే కుంకుడుకాయ , శీకాకాయ వంటి వాటితో తయారు చేసే షాంపూను ఉపయోగించడం ఉత్తమమైన పద్ధతి ఇలా చేస్తే అతి తక్కువ సమయంలోనే జుట్టును ఆరోగ్యంగా ఒత్తుగా పెంచుకోవచ్చు.