Health Problem : కడుపులో మంట.. తట్టుకోలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..!!

Health Problem : వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కడుపులో మంట వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవడంతో పాటు వైద్యుల వద్దకు వెళ్లడానికి కనీస ఓపిక కూడా ఉండదు. ముఖ్యంగా కడుపులో మంట వచ్చి మీరు తట్టుకోలేకపోతున్నట్లూ అయితే కొన్ని చిట్కాలు పాటించండి. ఇక సరైన సమయంలో నిద్రపోకపోవడం.. ఎక్కువగా తినడం వంటివి అనారోగ్యకరమైన అలవాట్లు కారణంగా కూడా గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎసిడిటి సమస్య అనేది జీవనశైలి వల్లే వస్తుంది అని వైద్యులు కూడా చెబుతున్నారు.

ఎసిడిటి అనేది ఇటీవల కాలంలో చాలామంది లో కనిపిస్తోంది. ముఖ్యంగా కడుపులో ఉత్పత్తి అయ్యే కొన్ని యాసిడ్ లు జీర్ణవ్యవస్థలో క్రియాశీలకంగా పని చేస్తాయి. ముఖ్యంగా అధికంగా ఉత్పత్తి అవడం తో పాటు జీర్ణ వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. అలాగే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ముఖ్యంగా యాసిడ్లు అధికంగా ఉత్పత్తి అయితే కడుపులో ఉండే సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. కడుపులో పుండ్లు ఏర్పడి అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం కూడా పోషకాహారం అయి ఉండాలి. ఉదయం ఆహారం మిస్ చేయకూడదు. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.

Health Problem Inflammation in the stomach Can not tolerate
Health Problem Inflammation in the stomach Can not tolerate

ఇక ఫాస్ట్ ఫుడ్ వంటివి దూరం పెట్టాలిప్రతిరోజూ వ్యాయామాలు , యోగా , ధ్యానం వంటివి చేయాలి. జీర్ణక్రియను మెరుగు పరచుకోవడం వల్ల ఎసిడిటీ బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా యోగాతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే కడుపులో యాసిడ్ల ఉత్పత్తి అదుపులో ఉంటుంది. ఇక మూడు పూటలా ఎక్కువ ఆహారం తీసుకోకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోషకాహారం తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ ను ఉత్పత్తి అవవు. ఫలితంగా కడుపులో మంట ఎసిడిటి వచ్చే సమస్య కూడా ఉండదు. ఇక పల్చటి మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే తాజా కూరగాయలు, పండ్లు తినడం వల్ల ఇటువంటి సమస్యలు దూరం అవుతాయి.