Health Benefits: గరుడ ముక్కు చెట్టు విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ చెట్లు ఎక్కువగా అటవీ ప్రాంతాలలో లభిస్తుంది పల్లె ప్రాంత వాసులకు ఈ చెట్టు సుపరిచితమే.. ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టు, గద్దాకు చెట్టు, గొఱ్ఱె జిడ్డాకు, తేలు కొండాకు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ చెట్టు కాయలను పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.. గరుడ ముక్కు కాయలను తాంత్రిక విధానాలకు ఎక్కువగా వాడతారు.. ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరుడులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి..
వీటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..పాము కాటు, తేలు కాటుకు ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి ఆ రసాన్ని దాని పైన వేసి ఆకులు కట్టుకడితే విషం విరిగిపోతుంది. క్షయవ్యాధితో బాధపడుతున్న వారు ఈ చెట్టు ఆకుల రసాన్ని మెడ మీద రాస్తే క్షయవ్యాధి తగ్గిపోతుంది. ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే గొంతు నొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి పూత, నోటి దుర్వాసనను పోగొడుతుంది.గరుడ ముక్కు చెట్టు పువ్వులు లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఇంకా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. కాలిన గాయాలకు ఈ చెట్టు వేరు పొడి కొబ్బరి నూనెలో కలిపి రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ చెట్టు వేర్లను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ కషాయం తాగితే అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ చెట్టు వేర్లను దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టి అలా ఉంచి తరువాత రోజు పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా తాగితే తలనొప్పి, ఛాతీలో కఫం, జాయింట్ పెయిన్ తగ్గుతుంది.