Vastu Shastra : హిందూ సాంప్రదాయంలో వాస్తుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఒకవేళ వాస్తు శాస్త్రాన్ని అనుసరించకపోతే మనకు తెలియని ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులను ఉంచడానికి ప్రతి దిశ కూడా దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.గృహోపకరణాలను సరైన మార్గంలో.. సరైన దిశలో ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. కానీ పెట్టకూడని దిశలో వస్తువులను పెట్టినట్లయితే ఆర్థిక సంక్షోభానికి దారి తీయడమే కాదు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు గొడవలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.ఇప్పుడు చెప్పబోయే కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు.
దక్షిణ దిశలో ఇంటి వెలుపల లేదా లోపల నీరు ఉండే ఏ సీ లను ఉంచరాదు. దక్షిణ దిక్కు అనేది యముడు, పితృదేవతల దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిశ నుండి శక్తి అధికంగా వస్తుంది. దక్షిణ దిశగా బాత్రూం, స్విమ్మింగ్ పూల్ , గార్డెన్ వంటివి పెట్టినట్లయితే ఇల్లు నాశనం అయ్యే అవకాశం కూడా ఉంది.పడక గది కూడా దక్షిణ దిశలో ఉండకూడదు. దక్షిణ దిశలో ఉండడం వల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి అవ్వడం కూడా జరగవచ్చు.ఇంటికి దక్షిణం వైపు పూజ గదిని నిర్మించరాదు. ఎందుకంటే దక్షిణ దిక్కును చనిపోయిన పితృ దేవతల దిశ గా ఎక్కువగా భావిస్తారు.
కాబట్టి ఈ దిక్కున కూర్చున్న లేదా దేవతలను పూజించినా పూర్తి ఫలితం లభించదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.వంటగది కూడా దక్షిణ దిశలో ఉండకూడదు. ఆహారం వండడం లో.. తినడం లో కూడా సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవడం , డబ్బు వృధా అవడం జరుగుతుంది.చెప్పులు, షూస్ , బూట్లు వంటివి ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు. ఇలా పెడితే పూర్వీకులను అవమానించినట్లుగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ఇలాంటి ఆర్టికల్స్ ను వాట్స్ అప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.